Hair Health Tips: నీరు మారితే జుట్టు ఊడిపోతుందా? మరి చుట్టాల ఇంటికి, స్విమ్మింగ్ ఫూల్ కు వెళ్లినప్పుడు పరిస్థితి ఏంటి?

Hair Health Tips: చాలా సమస్యల వల్ల జుట్టు రాలుతుంది. జుట్టు రాలడానికి కేవలం ఇక కారణం మాత్రమే ఉండదు.కొన్ని సార్లు జుట్టు సంబంధిత సమస్యల వల్ల కూడా జుట్టు రాలుతుంది. నేటి కాలంలో, జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, రసాయనాలు కలిగిన బ్యూటీ ఉత్పత్తులను వాడటం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అయితే తరచుగా నీటిని మార్చడం వల్ల జుట్టు రాలడం, చిట్లడం, జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కుంటారు అని అంటారు నిపుణులు. కానీ చాలా మంది నీటి విషయంలో పెద్దగా పట్టించుకోరు. అయితే నిజంగానే నీరు మారడం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుందా లేదా అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జుట్టు మీద నీటి ప్రభావం: మీరు కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు లేదా మీరు షిఫ్ట్ అయినప్పుడు అక్కడి నీటి నాణ్యత మీ జుట్టును ప్రభావితం చేస్తుంది. హార్డ్ వాటర్, రసాయనాలు జుట్టు మూలాలను బలహీనపరుస్తాయి. హార్డ్ వాటర్‌లో అధిక మొత్తంలో మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. ఇది జుట్టులోని తేమను తొలగించి, పొడిగా, బలహీనంగా ఉంచుతుంది. తద్వారా జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. అంతేకాదు ఈ హార్డ్ వాటర్ వల్ల జుట్టు మూలాలు ప్రభావితమవుతాయి. దీని కారణంగా జుట్టు పెరుగుదల తగ్గుతుంది. జుట్టు ఎక్కువగా విరిగుతుంది. జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. అలాగే, ఇతర జుట్టు సమస్యలు కూడా ప్రారంభమవుతుంది.
ఉప్పు నీటి ప్రభావం: మీరు తీర ప్రాంతంలో నివసిస్తుంటే, అక్కడి నీరు ఉప్పగా ఉండవచ్చు. ఉప్పు నీటిలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది జుట్టు సహజ మెరుపు, బలాన్ని నాశనం చేస్తుంది. దీనివల్ల జుట్టు సన్నగా, బలహీనంగా మారవచ్చు.
క్లోరినేటెడ్ నీరు: స్విమ్మింగ్ పూల్ నీటిలో క్లోరిన్ అధిక స్థాయిలో ఉంటుంది. క్లోరిన్ అధికంగా ఉండటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. క్లోరిన్ జుట్టులోని సహజ తేమను కోల్పోతుంది. దీని వలన జుట్టు పొడిగా మారుతుంది. చిట్లిపోయే సమస్య కూడా ఉంది.
దీన్ని ఎలా నివారించాలి?
మీ ఇంట్లో ఉపయోగించే నీటి నాణ్యతను తనిఖీ చేయండి. మీ ఇంట్లో హార్ట్ వాటర్ ఉంటే, మీరు సాఫ్ట్‌నర్‌ను ఉపయోగించవచ్చు. ఫిల్టర్ చేసిన నీటితో మీ జుట్టును వాష్ చేసుకోండి. జుట్టు కోసం RO నీటిని కూడా ఉపయోగించవచ్చు. ఈ హార్ట్ వాటర్ లో తేలికపాటి షాంపూ మాత్రమే ఉపయోగించాలి.
కొబ్బరి, ఆలివ్, బాదం నూనెతో జుట్టు మూలాలను మసాజ్ చేయవచ్చు. ఈత కొట్టిన తర్వాత, మీ జుట్టును మంచి నీటితో వాష్ చేసుకోండి. డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ ఉపయోగించండి. ఇది క్లోరిన్ ప్రభావాల నుంచి జుట్టును కాపాడుతుంది.
జుట్టు రాలడానికి నీటి మార్పులు ప్రధాన కారణం కావచ్చు. కానీ సరైన జాగ్రత్తలు, చర్యలతో దీనిని నివారించవచ్చు. జుట్టు ఆరోగ్యానికి నీటి నాణ్యతపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. నిపుణుల సలహాలను పాటించండి. మీ జుట్టును బలంగా, అందంగా ఉంచుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ట్రెండింగ్ తెలుగు వెబ్ సైట్ ఈ విషయాన్ని నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Hair: జుట్టు నివారణ చర్యలు కాదు.. జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసుకోవడం ముఖ్యం
-
Hair Health Tips: పదే పదే గుండు చేయిస్తే వెంట్రుకలు మందంగా వస్తాయా?
-
Rosemary Oil: తలకు రోజ్‌మెరీ ఆయిల్ అప్లై చేయవచ్చా? చేస్తే జుట్టు పెరుగుతుందా?
-
Hair: చికెన్‌కి, జుట్టుకి లింక్ ఏంటి.. దీనివల్ల జుట్టు పెరుగుతుందా.. ఇందులో నిజమెంత?
-
Hair Health: మీ జుట్టు బూడిద రంగులోకి మారిందా? వీటిని తింటే అసలు రంగే మారదు.
-
Hair Health: ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ జుట్టు రాలడాన్ని ఆపడం కష్టమే..