No Shampoo Trend: యూరప్‌లో ట్రెండ్ అవుతున్న నో షాంపూ.. ఇలా డైలీ తలస్నానం చేయవచ్చా?

No Shampoo Trend: సాధారణంగా కొందరు వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తుంటారు. ఇలా తలస్నానం చేసిన ప్రతీసారి కూడా షాంపూ కూడా పెడుతుంటారు. షాంపూ పెట్టడం వల్ల జుట్టు జిడ్డు అన్ని కూడా తొలగిపోతుంది. పొరపాటున షాంపూ లేకుండా తలస్నానం చేస్తే జుట్టు బంకగా ఉంటుంది. కానీ యూరోపియన్ దేశాల్లో మాత్రం షాంపూ లేకుండా తలస్నానం చేయడం అనేది ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. అబ్బాయిలు పోని తలకు స్నానం చేయకపోయినా జుట్టు పర్లేదు. కానీ అమ్మాయిలు మాత్రం జుట్టుకు షాంపూ పెట్టకుండా అసలు ఉండలేరు. కానీ యూరోపియన్ దేశాల్లో కొందరు మాత్రం తలకు షాంపూ అసలు పెట్టడం లేదు. పూర్తిగా షాంపూ వాడకాన్ని తగ్గించారు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఎక్కువగా షాంపూ పెట్టడం వల్ల జుట్టు సమస్యలు వస్తాయని, ఇన్ఫెక్షన్లు సోకుతాయని నమ్ముతారు. ఈ కారణం వల్ల చాలా మంది జుట్టుకు షాంపూ పెట్టడం లేదు. ఇలా షాంపూ పెట్టకపోతేనే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో తేలింది.
షాంపూలలోని సర్ఫ్యాక్టెంట్లు, సోడియం లారిల్ సల్ఫేట్ వంటివి మురికి, నూనెను తొలగిస్తాయి. కానీ అవి జుట్టు ప్రోటీన్లను కూడా దెబ్బతీస్తాయి. జుట్టు క్యూటికల్ (పై పొర) దెబ్బతింటుంది. జుట్టు సన్నగా, బలహీనంగా మారడంతో చీలిపోతుంది. దీనివల్ల జుట్టు అలెర్జీలు వస్తాయి. అలాగే చికాకు, దురద లేదా ఎరుపు దనం వస్తుంది. మరికొందరికి దద్దర్లు వంటివి కూడా వస్తాయని తేలింది. ఈ క్రమంలోనే చాలా మంది షాంపూ తలకు పెట్టి స్నానం చేయడం లేదు. ముఖ్యంగా షాంపూలో సల్ఫేట్లు, పారాబెన్లు లేదా కృత్రిమ సువాసనలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. అయితే జుట్టుకు షాంపూ లేకుండా తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు దారుణంగా దెబ్బతింటుంది. జిడ్డుగా మారడం, చెమట, దుమ్ము, కాలుష్య కణాల వల్ల మురికిగా మారుతుంది. అలాగే బ్యాక్టీరియా కూడా ఫుల్‌గా ఉంటుంది. దీనివల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు.
షాంపూలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల జుట్టు తొందరగా పాడవుతుంది. అందుకే చాలా మంది తలకు షాంపూ పెట్టడం లేదు. కొందరు సహజ పద్ధతులను జుట్టుకు ఉపయోగిస్తుంటారు. కుంకుడి కాయ, సికాయ వంటి వాటిని ఉపయోగించడం వల్ల జుట్టు రాలిపోకుండా ఉంటుంది. అలాగే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మారిన జీవనశైలి వల్ల చాలా మంది జుట్టు ఈ రోజుల్లో రాలిపోతుంది. జుట్టు రాలకుండా ఆరోగ్యంగా పెరగాలంటే తప్పకుండా ఇలాంటి సహజ షాంపూలను వాడండి. వీటిని వాడటం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది. సన్నగా ఉన్న జుట్టు కూడా దృఢంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Junior Movie: వైరల్ వయ్యారి అంటూ.. మాస్ స్టెప్స్‌తో సోషల్ మీడియాను ఉపేస్తున్న హాట్ బ్యూటీ
-
KTM Electric Bike:కేటీఎం నుంచి వచ్చేస్తున్న తొలి ఎలక్ట్రిక్ బైక్
-
Hair: జుట్టు నివారణ చర్యలు కాదు.. జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసుకోవడం ముఖ్యం
-
Hair Health Tips: పదే పదే గుండు చేయిస్తే వెంట్రుకలు మందంగా వస్తాయా?
-
Rosemary Oil: తలకు రోజ్‌మెరీ ఆయిల్ అప్లై చేయవచ్చా? చేస్తే జుట్టు పెరుగుతుందా?
-
Hair Health Tips: నీరు మారితే జుట్టు ఊడిపోతుందా? మరి చుట్టాల ఇంటికి, స్విమ్మింగ్ ఫూల్ కు వెళ్లినప్పుడు పరిస్థితి ఏంటి?
-
Hair: చికెన్‌కి, జుట్టుకి లింక్ ఏంటి.. దీనివల్ల జుట్టు పెరుగుతుందా.. ఇందులో నిజమెంత?