Health Tips: శస్త్ర చికిత్స తర్వాత త్వరగా కోలుకోవాలంటే ఏం చేయాలి?

Health Tips:
భారతదేశంలో ప్రతి సంవత్సరం 3 కోట్ల మంది పెద్ద ఆపరేషన్ చేయించుకుంటున్నారు. శస్త్ర చికిత్సలు చేయించుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కారణాలు ఏవైనా సరే ఈ చికిత్సలు పెరుగుతున్నాయి. పిల్లలు పుట్టడానికి, క్యాన్సర్ నయం కోసం, గుండె ఆపరేషన్ లు, కాలు, చేయి, ముక్కు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అవయవానికి ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుంది. ఎన్నో విధాలైన శస్త్ర చికిత్సలు నేడు అందుబాటులోకి వచ్చాయి. మనిషిని కాపాడే ప్రతి వైద్యం కూడా సక్సెస్ కావాలనే వైద్యులు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు శస్త్ర చికిత్స సక్సెస్ అయినా సరే తర్వాత రోగి అజాగ్రత్త వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. కొత్త సమస్య వస్తుంది.
ఇదంతా పక్కన పెడితే చిన్న శస్త్రచికిత్స చేయించుకుంటున్న వారి సంఖ్య ఇంకా మరింత ఎక్కువగానే ఉంది అంటున్నారు నిపుణులు. అయితే ఈ పెద్ద శస్త్రచికిత్స నుంచి కోలుకోవడానికి కనీసం 1 వారం పడుతుంది. కొంతమందికి నెల పట్టవచ్చు. లేదంటే మరికొందరికి మరింత ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. చాలా మంది వారంలోనే నడవడం ప్రారంభిస్తారు.
ఏదైనా శస్త్రచికిత్స లేదా ఆపరేషన్ తర్వాత, ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో, శస్త్రచికిత్స తర్వాత వేగంగా కోలుకోవడానికి మీకు సహాయపడే కొన్ని పద్ధతులను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. విశ్రాంతి: నిద్రపోతున్నప్పుడు శరీరం కోలుకునే స్థితిలో ఉంటుంది. నిద్ర శరీరంలోని లోపాల జాబితాను తయారు చేసి వాటిని సరిచేస్తుంది. ఈ సమయంలో శరీరం సమస్యలను సరిదిద్దుకోవడానికి పనిచేస్తుంది. అందుకే ఎలాంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకోవడం మంచిది. సో శస్త్రచికిత్స నుంచి త్వరగా కోలుకోవాలనుకుంటే, అవసరమైన మందులతో పాటు, కనీసం 8-9 గంటలు నిద్రపోవాలి అని మర్చిపోవద్దు.
2. ఆహారాలు: శస్త్రచికిత్స తర్వాత, గాయాన్ని నయం చేయడానికి, ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి వైద్యులు యాంటీబయాటిక్స్ ఇస్తారు. దీని కారణంగా కాలేయం బలహీనపడే ప్రమాదం ఉంది. ఈ సమయంలో, ఆకుకూరలు, పండ్లు వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి. వాటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపును తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కలిగిన ఆహారాలు కొత్త కణజాలాలు, కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. తద్వారా గాయాలు వేగంగా నయం అవుతాయి.
మరికొన్ని విషయాలు: డాక్టర్ మీకు చెప్పిన ప్రతిదాన్ని అనుసరించండి. డాక్టర్ సలహా మేరకు ఆహారాన్ని సిద్ధం చేసుకోండి. తినవద్దు అని చెప్పినవి, లేదంటే ఏవైనా కొన్ని పనులను చేయవద్దు అని చెబితే వాటిని కచ్చితంగా మానేయండి. ఏదైనా సమస్య ఉంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి. మీ వైద్యుడు సూచించిన విధంగా మీ శరీరాన్ని కదిలించండి. తేలికపాటి వ్యాయామాలు చేయండి. మరీ ముఖ్యంగా సిగరెట్లు, మద్యం పూర్తిగా మానుకోండి.
-
Health Tips: రోజంతా ఏం తినకపోయినా సరే ఆకలి అనిపించడం లేదా?
-
Black Salt: నల్ల ఉప్పు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
-
Health Tips: ఈ ఫ్రూట్ జూస్ లను మాత్రం అసలు కలిపి తీసుకోవద్దు..
-
Health Tips : వీరు ఎండు చేపలు తింటే.. అంతే సంగతులు
-
Health Alert: రోజంతా తినకపోయినా సరే ఆకలిగా అనిపించడం లేదా?
-
Health Tips: వేడి నీరు V/S గోరు వెచ్చని నీరు. ఏది మంచిది?