Health Tips: రాత్రి వీటిని అసలు తినకండి. కచ్చితంగా స్కిప్ చేయాల్సిందే..

Health Tips:
అన్నింటి కంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఇప్పుడు పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఆరోగ్యం బాగుంటే అన్ని బాగున్నట్టే. ఆరోగ్యంగా ఉంటే ఎంత సంపదను అయినా సరే సంపాదించవచ్చు. కానీ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటే ఉన్న సంపద మొత్తం పోతుంది. అందుకే ఆ దేవున్ని ఆరోగ్యంగా ఉంచమని కోరుకుంటే సరిపోతుంది. అయితే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలు ఆహారం తీసుకుంటారు కదా. ప్రతిసారి ఒకటే రకమైన ఆహారం తీసుకోరు. ప్రతిసారి ఆహార నియమాలు అలవాట్లు మారుతుంటాయి. ముఖ్యంగా కూరలు మాత్రం నిత్యం మారుతుంటాయి. కానీ ప్రతిసారి ఒకే రకమైన ఆహారం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఉదయం తినకూడనివి కొన్ని ఉంటే, మధ్యాహ్నం తినకూడనివి కొన్ని ఉన్నాయి. అంతేకాదు రాత్రి తినకూడనివి కూడా ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దామా?
పాలకూర
రాత్రి భోజనంలో పాలకూర తినకూడదు. ఎందుకంటే రాత్రిపూట దీన్ని తీసుకోవడం వల్ల అందులో ఉండే ఐరన్, ఫైబర్ జీర్ణం కావడం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో జీర్ణక్రియ సహజంగానే నెమ్మదిగా ఉంటుంది. అదే సమయంలో, రాత్రిపూట పాలకూర తినడం వల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది.
పండ్లు – పండ్ల రసాలు: రాత్రిపూట పండ్లు లేదా పండ్ల రసాలు తీసుకోవడం కూడా మానుకోవాలి. నిజానికి చెప్పాలంటే ఇవి చాలా పోషకమైనవి. అయినప్పటికీ, పండ్లలో ఉండే సహజ చక్కెరలు కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. మీ నిద్రకు భంగం కలిగిస్తాయి.
పచ్చి దోసకాయ – బీట్‌రూట్: చాలా మంది రాత్రిపూట సలాడ్‌లో ఈ రెండింటినీ చేర్చుకుంటారు. లేదా చాలా మంది కూరగాయలకు బీట్‌రూట్ కలుపుతారు. కానీ అలాంటి చల్లని ఆహారాలు సాయంత్రం వేళల్లో మీ జీర్ణక్రియను బలహీనపరుస్తాయని మీకు తెలుసా. అందుకే మీరు వాటిని రాత్రి భోజనంలో తినడం మానుకోవాలి.
మొలకెత్తిన ధాన్యాలు: రాత్రి భోజనంలో మొలకెత్తిన ధాన్యాలు తినడం మానుకోండి. ఎందుకంటే ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ, రాత్రిపూట వాటిని తినడం వల్ల గ్యాస్, కడుపు సమస్యలు వస్తాయి.
పెరుగు: మీరు రాత్రి భోజనంలో పెరుగు తినాలనుకుంటే, మీ ఈ అలవాటును కచ్చితంగా స్కిప్ చేయండి. ఎందుకంటే దాని చల్లని ప్రభావం వల్ల, రాత్రిపూట శ్లేష్మం పేరుకుపోతుంది. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.
ఇక ఇప్పుడు మనం పైన చూసిన ప్రతి పదార్థం కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఒక్కో పదార్థం ఒక్కో స్పెషాలిటీని అందిస్తుంది. ఫైబర్, జింక్, విటమిన్లను అందించే ఈ పదార్థాలు రాత్రి సమయంలో మంచి ఫలితాలను అందించవదు. సో వీటి విషయంలో జాగ్రత్త అవసరం. మెరుగైన జీర్ణవ్యవస్థ కోసం ఈ ఆహారాలను రాత్రి సమయంలో నివారించాల్సిందే. వాటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ రాత్రి మాత్రం అసలు మంచివి కాదు. సో ప్లీజ్ స్కిప్.
-
Health Tips: రోజంతా ఏం తినకపోయినా సరే ఆకలి అనిపించడం లేదా?
-
Black Salt: నల్ల ఉప్పు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
-
Health Tips: ఈ ఫ్రూట్ జూస్ లను మాత్రం అసలు కలిపి తీసుకోవద్దు..
-
Health Tips : వీరు ఎండు చేపలు తింటే.. అంతే సంగతులు
-
Health Alert: రోజంతా తినకపోయినా సరే ఆకలిగా అనిపించడం లేదా?
-
Health Tips: వేడి నీరు V/S గోరు వెచ్చని నీరు. ఏది మంచిది?