Monkey: ఇంట్లో కోతుల బెడద ఎక్కువ అయ్యిందా.. ఈ టిప్స్ పాటించండి

Monkey: కొన్ని గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది. అసలు కాస్త తలుపులు తీస్తే చాలు ఇంట్లోకి కోతులు వచ్చేస్తాయి. ఏ వస్తువును కూడా ఆర వేయలేరు. ఈ కోతులతో చాలా ఇబ్బంది పడుతుంటారు. నిజానికి కోతులు ఉంటే చాలా భయం. ఎందుకంటే ఎప్పుడైనా, ఎవరిని అయినా కూడా లాగేస్తాయి. ముఖ్యంగా పిల్లలను అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే కోతులు ఉంటే మాత్రం మనుషులను కొరికేస్తాయి. అయితే అన్ని గ్రామాల్లో ఇవి ఉండవు. కేవలం కొన్ని గ్రామాల్లో మాత్రమే ఉంటాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇలా ఎక్కడ అయితే అక్కడే కనిపిస్తుంటాయి. వీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కోతుల బెడద నుంచి విముక్తి చెందాలని అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోరు. ఏదో జస్ట్ వచ్చి చూస్తారు. అంతే తర్వాత మళ్లీ కోతులు గ్రామస్థులను తెగ ఇబ్బంది పెడుతుంటాయి. ఫిర్యాదు ఇచ్చి కూడా అలిసిపోయి లాస్ట్‌కి వదిలేస్తారు. అయితే ఇంటికి కోతులు రాకుండా, వీటి బెడద తప్పాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మరి ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
కోతులు ఎక్కువగా పంట పొలాల దగ్గర ఉంటాయి. పొలాల్లో ఉండు పంటలను ఎక్కువగా తింటుంటాయి. ఇలాంటి సమయంలో గన్ వినియోగించాలని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఈ గన్‌కి కోతులు భయపడతాయి. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన కొందరు కోతుల బెడదను తగ్గించడానికి ఎక్కువగా ఈ గన్ను వాడుతున్నారు. దీన్ని గ్యాస్ వెల్డింగ్కి సంబంధించిన పౌడర్ వేయాలి. ఆ తర్వాత ఒక్కసారి గ్యాస్ లైట్‌తో బర్న్ చేస్తే ఎక్కువగా సౌండ్ వస్తుంది. ఈ సౌండ్‌కి కోతులు బాగా భయపడతాయని అంటున్నారు. తప్పకుండా ఈ గన్ సౌండ్‌కి కోతులు ఎక్కడ ఉన్నా కూడా భయపడి పారిపోతాయి. దీన్ని ప్లాస్టిక్ బాటిల్లో వేసి కూడా తయారు చేయవచ్చు. దీనివల్ల ఈజీగా కోతులు దూరం అయిపోతాయి. మళ్లీ కోతుల సమస్యల అసలు ఉండదు. కొందరు కోతుల బెడద నుంచి విముక్తి చెందడానికి ఇంటి ముందు ఫినాయిల్ బాటిల్ పెడుతుంటారు. దీని వాసనకు కోతులు అసలు దరిచేరవు. కొందరు ఇంటి పైన దిష్టి బొమ్మను కూడా పెడుతుంటారు. దీనివల్ల కూడా కోతులు ఇంటి చుట్టూ దరిచేరవు.
-
Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
-
Anchor Anasuya: ఈ ఫీల్డ్‌లో అయితే మా ఆయన సక్సెస్ కాలేరు.. భర్తపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన అనసూయ
-
Electricity Bill: కరెంట్ బిల్ తక్కువగా రావాలా.. ఈ ఫ్యాన్లు వాడండి
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?