Sleep Health: ఆలస్యంగా నిద్రపోతే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

Sleep Health:
ప్రతీ మనిషికి నిద్ర అనేది తప్పనిసరి. శరీరానికి సరిపడా నిద్ర ఉండాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. మారిన జీవనశైలి వల్ల ప్రస్తుతం చాలా మంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. సోషల్ మీడియాకి బానిసై అర్థరాత్రి వరకు మొబైల్స్ చూసుకుంటున్నారు. దీంతో ఎక్కువగా నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏదో ఒక రోజు ఆలస్యంగా నిద్రపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ డైలీ ఆలస్యంగా నిద్రపోతే తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారు. కేవలం శారీరక మాత్రమే కాకుండా మానసిక సమస్యల బారిన కూడా పడతారు. మనిషి ఆరోగ్యంగా ఉండటంలో నిద్ర ముఖ్య పాత్ర వహిస్తుంది. డైలీ వేగంగా నిద్రపోతే ఎలాంటి సమస్యలు ఉండవు. అదే ఆలస్యంగా నిద్రపోతే ప్రమాదకర వ్యాధులు బారిన పడతారు. అయితే ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
బాడీకి సరిపడా నిద్ర ఉండాలి. లేకపోతే టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర తక్కువ అయితే ఊబకాయం కూడా వచ్చే ప్రమాదం ఉంది. కొందరు గ్యాప్ లేకుండా మొబైల్ చూస్తుంటారు. దీంతో పూర్తిగా నిద్రపట్టదు. దీంతో డిప్రెషన్‌లోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న యువత ఎక్కువగా ఈ సమస్యనే ఫేస్ చేస్తున్నారు. అర్థరాత్రి వరకు మేల్కోని ఉండటం, ఉదయం ఆలస్యంగా లేవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పలు రకాల అనారోగ్య సమస్యలు రావడంతో పాటు అలసట, చికాకు, మానసిక ఒత్తిడి, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. నిద్రలేమి వల్ల పెరుగుదల కూడా ఉండదు. నిద్ర లేకపోతే ఏ సమస్య మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేరు. ప్రతీ విషయంలో చిరాకుగా ఉంటుంది. కాబట్టి రోజుకి తప్పనిసరిగా 8 గంటలు నిద్రపోండి. అయితే ఇది వయస్సును బట్టి ఉంటుంది. చిన్న పిల్లలు అయితే రోజులో ఎక్కువ గంటలు నిద్రపోవాలి.
నిద్రలేమి సమస్య వస్తే అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. వీటి నుంచి విముక్తి పొందాలంటే.. మీరు డైలీ ఒక టైమ్ పాటించాలి. రోజూ కూడా ఒకే సమయానికి లేవడం, నిద్రపోవడం వంటివి చేయాలి. పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. అర్థరాత్రి వరకు మేల్కొని ఉండకుండా తొందరగా నిద్రపోయి.. త్వరగానే నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఒక్క రోజే అని మీరు ఆలస్యంగా నిద్రపోవడానికి అలవాటు పడితే మాత్రం తప్పకుండా అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే సాయంత్రం సమయాల్లో కాఫీ, టీ వంటివి తాగవద్దు. వీటివల్ల రాత్రి సరిగ్గా నిద్రపట్టదు. దీంతో నిద్రలేమి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రాత్రి వేళలో ఫ్రై ఫుడ్స్, కాఫీ, టీ, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటి వాటిని అసలు తీసుకోవద్దు. వీటివల్ల మీకు నిద్రకు భంగం కలుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నిద్ర విషయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించండి.a
-
Vastu Tips: దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Sleep: పడుకున్న వెంటనే నిద్ర పట్టాలా? ఇవి పాటించండి..
-
Sleep: పగటి పూట నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా? ఎంత టైమ్ నిద్రపోవాలి
-
Sleep: బెడ్ ఎక్కిన వెంటనే నిద్ర పోవాలి అంటే ఇలా చేయండి..
-
Sleep: పడుకునేటప్పుడు బ్రా వేసుకుని పడుకుంటున్నారా? వామ్మో ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?
-
Sleep Health: అలారం పెట్టుకొని నిద్ర లేస్తున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే..