Sleep: పగటి పూట నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా? ఎంత టైమ్ నిద్రపోవాలి

Sleep:
ప్రతీ మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. నిద్ర లేకపోతే ఎవరైనా కూడా బలహీనం అయిపోతారు. ఏ పని చేయలేక నీరసంగా ఉంటారు. నిజానికి దేని మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ రాదు. ఇవన్నీ పక్కన పెడితే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది తక్కువ సమయం మాత్రమే నిద్రపోతున్నారు. రాత్రి వరకు మేల్కోని మొబైల్స్ వంటివి చూస్తున్నారు. లేట్ నైట్ నిద్రకు బాగా అలవాటు పడుతున్నారు. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. రాత్రి అంటే ఒక నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. మళ్లీ పగటి పూట అసలు నిద్రపోవడం లేదు. అయితే నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. రాత్రి పూట సరిగ్గా నిద్రపోతే.. పగటి పూట కాస్త సమయం అయినా నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. అసలు పగటి పూట నిద్ర ఆరోగ్యానికి ఎందుకు మంచిది? ఎంత సమయం పగటి పూట నిద్రపోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
పగటి పూట నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎక్కువ సమయం కాకుండా తక్కువ సమయం మాత్రమే నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. పగటి పూట ఒక అరగంట లేదా గంట పాటు నిద్రపోవడం వల్ల యాక్టివ్‌గా ఉంటారని నిపుణలు చెబుతున్నారు. మెదడు పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏ విషయాన్ని అయినా కూడా ఆలోచించగలుగుతారు. మీకు ఎంత చిరాకు ఉన్నా కూడా యాక్టివ్‌గా మారుతారు. పగలు కనీసం పది నిమిషాలు అయినా నిద్రపోతే మాత్రం తప్పకుండా మీలో శక్తి పెరుగుతుంది. నీరసం అలాంటివి అన్ని కూడా తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. ఇవే కాకుండా ఒత్తిడి, ఆందోళన అన్ని కూడా తగ్గుతాయి. నిద్ర తక్కువ అయితే ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతుంది. ఎమోషనల్‌గా కూడా చాలా వీక్ అయిపోతారు. అదే మీరు పగటి పూట 30 నిమిషాలు నిద్రపోతే మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎలాంటి ఒత్తిడి, ఆందోళన కూడా ఉండవు. అలాగే గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గు్తుంది. జీవక్రియ కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది తక్కువగా నిద్రపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. నిద్రలేక పోతే మనిషి చాలా తగ్గిపోతాడు. ప్రమాదకర వ్యాధుల బారిన ఎక్కువగా పడుతున్నారు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా నిద్రను అసలు లైట్ తీసుకోవద్దు. తప్పకుండా సరైన సమయానికి నిద్రపోవాలి. మనిషికి రోజుకి 8 గంటల నిద్ర అనేది అవసరం. తప్పకుండా ఈ సమయం మనిషికి నిద్రపోతేనే ఆరోగ్యంగా ఉంటాడు. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
-
Vastu Tips: దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Sleep: పడుకున్న వెంటనే నిద్ర పట్టాలా? ఇవి పాటించండి..
-
Sleep Health: ఆలస్యంగా నిద్రపోతే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
-
Coconut water: ఆరోగ్యానికి మంచిదని కొబ్బరి నీళ్లు అధికంగా తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Sleep: బెడ్ ఎక్కిన వెంటనే నిద్ర పోవాలి అంటే ఇలా చేయండి..
-
Sleep: పడుకునేటప్పుడు బ్రా వేసుకుని పడుకుంటున్నారా? వామ్మో ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?