Sleep: పడుకునేటప్పుడు బ్రా వేసుకుని పడుకుంటున్నారా? వామ్మో ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

Sleep:
రాత్రి పడుకునేటప్పుడు కూడా బ్రా ధరిస్తారా? మీకు ఈ అలవాటు ఉంటే మీరు పెద్ద ప్రమాదంలో పడబోతున్నట్టే. అవును నిజమేనండోయ్. ఈ బ్రా మీ రొమ్ము ఆరోగ్యానికి పెద్ద సమస్యగా మారుతుంది అంటున్నారునిపుణులు. రాత్రిపూట బ్రా ధరించడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది రొమ్ములలో నొప్పి, వాపు, మంట వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు ఎక్కువ సమయం టైట్ బ్రా ధరించడం వల్ల చర్మంపై దద్దుర్లు, నల్లబడటం వంటి సమస్యలు కూడా వస్తాయి. దీనితో పాటు, రాత్రంతా బ్రాతో పడుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే వైద్యులు రాత్రి పడుకునే ముందు బ్రాను తొలగించమని సూచిస్తుంటారు. అయితే మనం ఈ ఆర్టికల్ లో బ్రాతో పడుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
దద్దుర్లు – నల్లటి మచ్చలు: వాతావరణం ఏదైనా, రోజంతా బిగుతుగా ఉండే బ్రా ధరించడం మీ ఆరోగ్యానికి మంచిది. కానీ రాత్రి పడుకునే ముందు దాన్ని తీసివేయాలి. దీని వల్ల చర్మం పై దద్దుర్లు, చికాకు, దురద వస్తుంది. ఈ ప్రాంతంలో అధిక చెమట పట్టడం వల్ల, ఇక్కడి చర్మం మరింత సున్నితంగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట బ్రా తొలగించి నిద్రపోవడం సరైనది. మీరు ఈ దద్దుర్లను కూడా లైట్ తీసుకుంటే కాలక్రమేణా ఇవి నల్ల మచ్చలుగా కూడా మారుతాయి.
అలెర్జీ సమస్యలు: రోజంతా బ్రా ధరించడం వల్ల రొమ్ముల చుట్టూ చెమట పేరుకుపోతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు రాత్రిపూట కూడా ఒకే బ్రా ధరిస్తే, మీ చర్మం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. ఇలా చేయడం వల్ల చర్మానికి గాలి అందదు. తేమ అలాగే ఉంటుంది కాబట్టి, బ్యాక్టీరియా పెరుగుదల ప్రమాదం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా మీరు దద్దుర్లు, కురుపులు, అలెర్జీలు వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
రాత్రిపూట బిగుతుగా ఉండే బ్రా ధరించడం వల్ల రొమ్ముల చుట్టూ ఉన్న ప్రాంతంలో రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. మీరు బిగుతుగా ఉండే బ్రా ధరిస్తే మీ రొమ్ములపై ఒత్తిడి వస్తుంది. రక్త నాళాలు సంకోచిస్తాయి. తద్వారా ఆ ప్రాంతానికి రక్త ప్రసరణ తగ్గుతుంది. దీని వలన మీకు రొమ్ములో నొప్పి, వాపు, తిమ్మిరి కలుగుతుంది.
నిద్ర: మంచి నిద్ర కోసం, మీ మంచం మాత్రమే కాదు, మీ బట్టలు కూడా సౌకర్యవంతంగా ఉండాలి. బిగుతుగా ఉండే బ్రాతో పడుకోవడం వల్ల రొమ్ము ప్రాంతంలో గాలి చేరదు. దీనివల్ల అధిక చెమట పడుతుంది. బరువుగా, కంఫర్ట్ గా ఉండదు. అందుకే మీ నిద్రకు భంగం కలుగుతుంది. అలిసి పోయినట్టు అనిపించినా ఉదయం అలసటగా అనిపించినా సరే రాత్రిపూట బిగుతుగా ఉండే బ్రా ధరించడం వల్లనే ఇలా జరుగుతుంది అని అనుకోండి. కొన్ని సార్లు బ్రా వల్ల మీకు మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు కూడా రావచ్చట.
రొమ్ము క్యాన్సర్ ప్రమాదం
రాత్రిపూట మీ బ్రాను తొలగించడం వల్ల మీ రొమ్ము కండరాలు సడలింపుకు గురి అవుతాయి. రక్తం సజావుగా ప్రవహిస్తుంది. ఇది రొమ్ము ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మంచి నిద్ర పొందడానికి కూడా సహాయపడుతుంది. ప్రతి రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. సో తీసి పడుకోవడం బెటర్.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Vastu Tips: దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Sleep: పడుకున్న వెంటనే నిద్ర పట్టాలా? ఇవి పాటించండి..
-
Sleep Health: ఆలస్యంగా నిద్రపోతే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
-
Sleep: పగటి పూట నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా? ఎంత టైమ్ నిద్రపోవాలి
-
Sleep: బెడ్ ఎక్కిన వెంటనే నిద్ర పోవాలి అంటే ఇలా చేయండి..
-
Sleep Health: అలారం పెట్టుకొని నిద్ర లేస్తున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే..