Summer: వేసవిలో ఎక్కువగా చెమట ఇబ్బంది పెడుతుందా? ఈ టిప్స్ పాటించండి

Summer:
వేసవిలో బాగా ఉక్కపోతగా ఉంటుంది. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, వేడి, వడగాలులు ఎటు చూసినా కూడా వేడి గాలి తగలడంతో చెమట ఎక్కువగానే ఉంటుంది. మరికొందరికి ఎంత నీడలో ఉన్నా కూడా చెమట ఎక్కువగా ఉంటుంది. అయితే చెమట ఎక్కువగా ఉండటం వల్ల కొందరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే చెమట ఎక్కువగా ఉంటే దుస్తులు మొత్తం తడిచిపోతాయి. దీంతో చిరాకుగా ఉంటుంది. కొందరికి ఎండ తీవ్రత వల్ల చెమట ఎక్కువగా వస్తే.. మరికొందరికి హోర్మోన్ల స్థాయిలోని మార్పులు వల్ల కూడా వస్తుంది. ఇవే కాకుండా ఎక్కువగా బరువు ఉండటం, మధుమేహం, కోపం, ఆందోళన, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ సమస్యలు వంటి కారణాల వల్ల కూడా చెమట ఎక్కువగా వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే కొన్నిసార్లు చెమట బయటకు రావడం కూడా మంచిదే. ఎందుకంటే శరీరంలోని మలినాలు అంతా కూడా ఈ చెమట రూపంలోనే బయటకు వస్తాయి. కానీ మరీ ఎక్కువగా వేసవిలో చెమట ఎక్కువగా రావడం వల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే తప్పకుండా ఈ చిట్కాలు పాటించండి.
చెమట ఎక్కువగా రాకుండా ఉండాలంటే ఓ చిన్న టిప్ పాటిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. ఒక టేబుల్ స్పూన్ కార్న్ స్టా్ర్చ్ తీసుకోవాలి. అందులో కాస్త బేకింగ్ సోడా వేసి టేబుల్ స్పూన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని చెమట ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో అప్లై చేసి ఒక అరగంట పాటు ఉంచాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే మీకు చెమట తగ్గుతుంది. అలాగే బాడీ ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురైనా కూడా చెమట వస్తుంది. కాబట్టి ఎక్కువగా జ్యూస్‌లు వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే చెమట నుంచి విముక్తి పొందడానికి గోధుమ గడ్డి జ్యూస్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. గోధుమ గడ్డిలో, టొమాటో వేసి జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్ తాగడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో కొంతవరకు చెమట తగ్గుతుంది. గోధుమ గడ్డిలో విటమిన్లు, ఫోలికామ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది చెమట నుంచి విముక్తి కలిపించడంతో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బాడీ హైడ్రేట్‌గా ఉండి చర్మ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. వీటితో పాటు పాలకూర వంటి పోషకాలు ఉండే వాటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువగా మసాలా ఫుడ్ తీసుకున్నా కూడా చెమట వస్తుందని నిపుణులు అంటున్నారు. చెమట వచ్చే వారు కారం, పచ్చి మిర్చి, మసాలా ఉండే వాటిని అసలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరం నుంచి ఎక్కువగా వేడిని విడుదల చేసి.. చెమట ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. శరీరానికి వేడి చేసే వాటిని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే వేసవిలో కాఫీ ఎక్కువగా తీసుకోకూడదు. వీటివల్ల ఒత్తిడి పెరిగి చెమట వస్తుంది. కాబట్టి ఎక్కువగా వేడి చేసే వస్తువులను అసలు తీసుకోవద్దు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?
-
Zodiac Signs: ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మాయం.. ఈ రాశుల వారి పంట పండినట్లే