Summer: ఇవి మీ ఇంట్లో ఉంటే.. సమ్మర్‌లో ఏసీ లేకపోయినా పర్లేదు మీకు చల్లదనమే

Summer:
వేసవి కాలం తొందరగానే వచ్చేసింది. ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండేస్తున్నాయి. చాలా మంది ఏసీలు కొనుక్కుంటారు. అయితే ఏసీ కొనే స్థోమత అందరికీ ఉండదు. దీంతో కూలర్ వంటివి వాడుతుంటారు. అలాగే కొందరు ఫ్యాన్ వంటివి కూడా వాడుతారు. అయితే ఫ్యాన్ వేడి గాలిని ఇస్తుంది. దీనికి తోడు బయట ఏ చిన్న పని మీద వెళ్లినా కూడా బయట వేడిగా ఉంటుంది. ప్రతీ సారీ కూలర్‌ను తీసుకెళ్లలేరు. అయితే వేసవిలో ఎక్కడికి వెళ్లినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కొన్ని వేసవి గ్యాడ్జెట్లను వాడవచ్చు. ఇవి మీకు వేసవిలో బాగా ఉపయోగపడతాయి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
స్టెయిన్‌లెస్ స్టీల్ టంబ్లర్
వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ పట్టుకుని బయటకు తిరగలేరు. పోనీ వాటర్ తాగాకుండా ఉంటే బాడీ డీ హైడ్రేషన్‌కు గురి అవుతుంది. దీంతో నీరసం, అలసట వస్తాయి. అదే మీరు ఎక్కడికి వెళ్లినా కూడా స్టెయిన్‌లెస్ స్టీల్ టంబ్లర్‌ను తీసుకెళ్లే అందులో నీరు చల్లగా ఉంటాయి. చల్లగా నీరు ఉండటం వల్ల మీరు ఎక్కువగా వాటర్ తాగుతారు. ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ టంబ్లర్ సురక్షితమైనది కూడా.
కూల్ జెల్ సీట్ కుషన్
ఈ మిషన్ వల్ల మీరు ఎక్కడ ఉన్నా కూడా చల్లగా ఉంటుంది. మీరు పొరపాటున ఆఫీసు లేదా బయట ఉంటే ఈ కుషన్ మీ బాడీని కూల్ చేస్తుంది.
హ్యాండ్‌హెల్డ్ మినీ ఫ్యాన్
ఈ మినీ ఫ్యాన్ అనేవి వేసవిలో ప్రతీ ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది. వేసవిలో ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా కూడా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. అదే ఈ మినీ ఫ్యాన్‌ను ఉపయోగించం వల్ల మీరు ఎక్కడ ఉన్నా కూడా చల్లదనమే ఉంటుంది. దీన్ని మీరు ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు.
నెక్ ఎయిర్ కండిషనర్
ఈ నెక్ ఎయిర్ కండిషనర్ మీకు ఎల్లప్పుడూ కూడా చల్లని గాలిని ఇస్తుంది. దీన్ని మీరు మెడకు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఉక్కపోత తగ్గడంతో పాటు చల్లగా ఉంటుంది.
పోర్టబుల్ మినీ ఫ్రిడ్జ్
ఈ మినీ ఫ్రిడ్జ్ చాలా చిన్నగా ఉంటుంది. ఇందులో తక్కువగా మాకు కావాల్సిన వాటిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఇందులో మీరు ఐస్‌క్రీములు, చాక్లెట్లు, వాటర్ బాటిల్, డ్రింక్‌లు లా ఏవైనా కూడా తీసుకెళ్లవచ్చు.
కూలింగ్ టవల్స్
వేసవిలో ఎక్కువగా చెమట పడుతుంటారు. దీంతో బయటకు వెళ్లి వచ్చిన ప్రతీసారి కూడా ముఖం శుభ్రం చేసుకుని తుడచుకుంటారు. అదే కూలింగ్ టవల్స్‌ను వాడితే మీకు ఎక్కువ సమయం చల్లదనం ఉంటుంది.
కూలింగ్ మ్యాటర్స్
వేసవిలో వేడి వల్ల అసలు నిద్రపట్టదు. దీనికోసం కూలింగ్ మ్యాట్రస్‌ను ఉపయోగిస్తే.. మీకు హాయిగా నిద్రపడుతుంది. ఎలాంటి ఉక్కపోత లేకుండా హాయిగా ఉంటుంది.
-
Small AC: రూ.2వేల లోపే ఏసీ లాంటి గాలి.. దీంతో ఈ వేసవికి గుడ్ బై చెప్పేయండి
-
Summer: వేసవి సెలవుల్లో పిల్లలకు బోర్ కొట్టకుండా ఉండాలంటే.. వీటిని నేర్పించండి
-
Beer Price : మందుబాబులకు ప్రతి రోజూ పండగే…200 బీర్ ఇక రూ.50కే
-
Summer Drinks : వేసవిలో డ్రింక్స్ కంటే.. ఈ వాటర్ బెటర్
-
AC: ఏసీలో ఎక్కువ సమయం ఉంటే.. బరువు పెరుగుతారా?
-
Ice creams: సమ్మర్‌లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?