Summer Season : వేసవిలో ఎలాంటి దుస్తులు ధరిస్తే.. చల్లగా ఉంటుందంటే?

Summer Season : వేసవిలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉదయం నుంచే ఎండ మండిపోతుంది. ఏదైనా అవసరానికి బయటకు వెళ్తే చాలు ఒళ్లంతా చెమటతో నిండిపోతుంది. వేసవిలో చర్మం ఘోరంగా దెబ్బతింటుంది. చెమట, ధూళి వల్ల చర్మ సమస్యలు ఎక్కువ వస్తాయి. వేసవిలో మనం తినే ఫుడ్ నుంచి ధరించే దుస్తులు వరకు అన్ని విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చిరాకుగా ఉంటుంది. వేసవిలో మీరు తినే ఫుడ్, అన్ని కూడా చాలా ముఖ్యమైనవి. ప్రతీ విషయంలో కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే కొందరు వేసవిలో ఎక్కువగా చల్లగా ఉండే వాటిని కాకుండా శరీరానికి వేడినిచ్చే వాటిని ధరిస్తుంటారు. వీటివల్ల చెమట ఉండటంతో పాటు కాస్త చిరాకుగా ఉంటుంది. అయితే వేసవిలో ఎక్కువగా చెమట పట్టకుండా ఉండాలంటే కొన్ని రకాల దుస్తులను మాత్రమే ధరించాలి. అప్పుడే ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే వేసవిలో ఎలాంటి దుస్తులు ధరిస్తే హాయిగా ఉంటుందో ఈ స్టోరీలో చూద్దాం.
వేసవిలో సిల్క్ కాకుండా బాడీకి చల్లదనాన్ని ఇచ్చే కాటన్, లినెన్, ఖాదీ వంటి దుస్తులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి చెమటను తొందరగా పీల్చుకుని, శరీరాన్ని చల్లబరుస్తాయి. దీంతో మీకు ఎలాంటి చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మంపై దద్దర్లు వంటివి కూడా రావని నిపుణులు చెబుతున్నారు. కొందరు వేసవిలో ఎక్కువగా నల్లని దుస్తులు ధరిస్తుంటారు. వేసవిలో నల్లటి దుస్తులు కాకుండా తెలుపు, లేత నీలం, గులాబీ లేదా లేత గోధుమ రంగు వంటి లైట్ కలర్స్‌లో ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి. వీటివల్ల బాడీ వేడికి గురి కాదు. శరీరమంతా కూడా చల్లగా ఉంటుంది. ఒకవేళ చెమట ఎక్కువగా ఉన్నా కూడా కాటన్ దుస్తులు పీల్చేస్తాయి. ఈ లేత రంగులు మాత్రమే సూర్యరశ్మిని ఈజీగా గ్రహిస్తాయి. దీంతో మీ శరీరం చల్లబడుతుంది. ఈ రంగులు సూర్యరశ్మిని గ్రహించి శరీరాన్ని చల్లబరచవు. అయితే, నలుపు, ముదురు నీలం, గోధుమ రంగు వంటి ముదురు రంగు దుస్తులు సూర్యుని వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరం వేగంగా వేడెక్కడంతో పాటు చెమట కూడా పడుతుంది. ఇదంతా కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో కాటన్‌వి, శరీరాన్ని చల్లగా ఉంచే వాటిని తీసుకోవాలి. వీటివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
వేసవిలో ఎప్పటికప్పుడు దుస్తులు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చెమటకు బ్యా్క్టీరియా అందులో ఉండిపోతుంది. మళ్లీ మీరు వాటిని ధరిస్తే మీకు చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి వేసవిలో ఎప్పటికప్పుడు దుస్తులు వాష్ చేసుకోవాలి. అలాగే దుస్తులను ఒకసారి మాత్రమే ధరించాలి. పదే పదే ధరించడం వల్ల దుర్వాసన వస్తాయి. కాబట్టి వేసవిలో దుస్తుల విషయంలో ఇలాంటి మిస్టేక్స్ అసలు చేయవద్దు.
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Summer Fruit: సమ్మర్లో దొరికే ఈ ఫ్రూట్ తింటే.. రోగాలన్నీ పరార్
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు