Sleeping : నిద్ర రావడం లేదా? నిద్రకు మెగ్నీషియానికి ఏంటి సంబంధం?

Sleeping :
ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. ఇది శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా మనసుకు కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే, నేటి బిజీ జీవితం, ఒత్తిడి కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారు. కొన్నిసార్లు నిద్రలేమి సమస్య మెగ్నీషియం లోపం వల్ల కూడా రావచ్చు అంటున్నారు నిపుణులు. మీ ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం చాలా అవసరం. మెగ్నీషియం శరీరాన్ని ప్రశాంతపరచడానికి, నిద్రను మెరుగుపరచడానికి సహాయపడే ఖనిజం. మెగ్నీషియం అధికంగా ఉండే, మంచి నిద్ర పొందడానికి సహాయపడే ఆ 5 ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పాలకూర: పాలకూర ఒక పోషకమైన ఆకుకూర. ఇది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. మెగ్నీషియానికి అద్భుతమైన మూలం ఇది. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అదనంగా, పాలకూరలో విటమిన్లు, ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రాత్రి భోజనంలో పాలకూరను యాడ్ చేసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.
బాదం: బాదం రుచికరమైనది మాత్రమే కాదు. ఇందులో ఎక్కువ మెగ్నీషియం ఉంటుంది. ప్రతిరోజూ ఒక గుప్పెడు బాదం తినడం వల్ల శరీరానికి మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. బాదంపప్పులో ఉండే మెలటోనిన్ నిద్రకు కూడా మేలు చేస్తుంది. రాత్రి పడుకునే ముందు బాదం తినడం మంచి అలవాటు.
గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజల్లో కూడా మెగ్నీషియం ఎక్కువగానే ఉంటుంది. ఈ విత్తనాలలో ఉండే మెగ్నీషియం శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది. నిద్రను ప్రేరేపిస్తుంది. గుమ్మడికాయ గింజలను స్నాక్‌గా తినవచ్చు. సలాడ్‌లు, స్మూతీలకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి నిద్రకు మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ రుచిగా ఉండటమే కాకుండా, మెగ్నీషియాన్ని అందిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే, డార్క్ చాక్లెట్‌లో కెఫిన్ కూడా ఉంటుంది కాబట్టి, దానిని పరిమితంగానే తీసుకోవాలి. లేదంటే ఇది నిద్రను ప్రభావితం చేస్తుంది. రాత్రి పడుకునే ముందు కొద్ది మొత్తంలో డార్క్ చాక్లెట్ తినాలి.
అరటిపండు: అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు మెగ్నీషియం కూడా ఉంటుంది. అరటిపండ్లలో ఉండే మెగ్నీషియం శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. రాత్రి పడుకునే ముందు అరటిపండు తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది.
Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.
-
Getting Good Job: కలలో ఇవి కనిపిస్తే.. కోరుకున్న ఉద్యోగం రావడం ఖాయం
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Beauty Tips : స్టీమ్ ఫేషియల్‌తో చర్మానికి బోలెడన్నీ ప్రయోజనాలు
-
Blood donation : ఏడాదిలో ఓ వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయాలంటే?
-
Beauty Tips : నోటికి తీపి, చర్మానికి అందం.. ఈ ప్యాక్ వేసుకుంటే మెరిసిపోతారు
-
Success: జీవితంలో విజయం పొందాలంటే.. ఈ రూల్స్ పాటించాల్సిందే