Gold: వాడకుండా ఉంటే బంగారం పోతుందా?
Gold ఇనుప మిశ్రమాలు మాత్రమే తుప్పు పడతాయి. వాతావరణంలోని తేమ, ఆక్సిజన్ ఇనుములో ఉండే రసాయన ప్రతి చర్య వల్ల వాటిపై ముదురు ఎరుపు రంగు పొర ఏర్పడుతుంది.

Gold: బంగారం అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరూ ఉండరు. ఎందుకంటే బంగారానికి ఉన్న విలువ అలాంటిది. రోజురోజుకీ బంగారం విలువ పెరుగుతూనే వస్తుంది. కానీ తగ్గడం లేదు. చాలా మంది దీన్ని వాడినా, వాడకపోయినా కూడా కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటారు. అయితే కొందరు ఏడాదికి ఒకసారి అయినా వాడుతుంటారు. మరికొందరు వాటిని పూర్తిగా వాడరు. అయితే బంగారాన్ని పూర్తిగా వాడకపోవడం వల్ల అది ఏమైనా తుప్పు పడుతుందా? లేకపోతే ఏదో విధంగా పాడవుతుందా? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఇనుప మిశ్రమాలు మాత్రమే తుప్పు పడతాయి. వాతావరణంలోని తేమ, ఆక్సిజన్ ఇనుములో ఉండే రసాయన ప్రతి చర్య వల్ల వాటిపై ముదురు ఎరుపు రంగు పొర ఏర్పడుతుంది. దీన్నే మనం తుప్పు పట్టడం అంటాం. అయితే బంగారం ఎప్పటికీ కూడా తుప్పు పట్టదు. కానీ కొన్ని రసాయనాల వల్ల దాని సహజ రంగును అయితే కోల్పోతుంది. బంగాన్ని కరిగించి తయారు చేస్తారు. ఇది సాధారణ ఆమ్లాలతో చర్య జరపదు. బంగారం కేవలం ఆక్వా రెజియా ఆమ్లంలో మాత్రమే కరుగుతుంది. దీనివల్ల బంగారం తుప్పు పట్టదు. దేశంలో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్ల స్వచ్ఛత ఉన్న బంగారం ఉంది. అయితే ఎక్కువగా ఆభరణాలను తయారు చేయడానికి 22, 18, 14 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. తక్కువ క్యారెట్లు అయినా, ఎక్కువ క్యారెట్లు అయినా బంగారం తుప్పు పట్టదు. కానీ ఎక్కువ రోజులు బంగారు ఆభరణాలు వాడకుండా వదిలేస్తే మాత్రం అవి సహజ రంగును కోల్పోతాయి. బంగారు ఆభరణాలు ధరించినా, ధరించకుండా వదిలేసినా అవి పాతబడిపోతాయి. కానీ అది తుప్పు పట్టదు. అది బంగారం వాడే కొలది కాస్త నల్లగా అవుతుంది. అంతే కానీ దీనిలో ఎలాంటి మార్పు కూడా ఉండదు.
ప్రస్తుతం రోజుల్లో బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మార్కెట్‌లో బంగారం విలువ ఎక్కువగా ఉంది. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇండియాలో పెళ్లి అంటే ముందుగా గుర్తు వచ్చేది బంగారం. ఏదైనా ఫంక్షన్, పెళ్లి, పండుగ ఉంటే చాలు.. మహిళలు బంగారు ఆభరణాలతో నిండుగా తయారు అవుతారు. పెళ్లిలో బంగారం కూడా కట్నంగా మారిపోయింది. దీంతో బంగారం విలువ రోజురోజుకీ పెరుగుతుంది. ప్రస్తుతం తులం బంగారం విలువ లక్ష పైనే ఉంది. ఈ బంగారాన్ని కొన్న తర్వాత అమ్మేసుకున్నా పర్లేదు.. అని చాలా మంది దీన్ని కొని దాచుకుంటున్నారు. రోజురోజుకీ బంగారం ధర పెరగడం వల్ల చాలా మంది ముందుగానే కొనుక్కుంటున్నారు. దీన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని, పాడవదని చాలా మంది దీన్ని కొంటారు.
-
Gold Loan: బంగారం లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి
-
Gold: ప్రపంచంలో ఏ దేశంలో అత్యధిక బంగారం ఉందంటే?
-
Gold prices : కొండెక్కుతున్న పసిడి ధరలు.. ఆల్టైమ్ రికార్డు స్థాయిలో గోల్డ్
-
Vastu Tips: వారంలో ఏ రోజు బంగారం కొనడానికి మంచిదో మీకు తెలుసా?
-
Tips:పాత బంగారు నగలు కొత్తగా మెరవాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి