Gold Loan: బంగారం లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు
బంగారం ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య మనుషులు బంగారం కొనాలంటే కష్టమే. అందులోనూ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవి బాధత్యలు స్వీకరించినప్పటి నుంచి బంగారం ధరలు ఇంకా పెరుగుతున్నాయి. టారిఫ్‌లు విధించడంతో వీటి ధరలు ఇంకా ఎక్కువగా పెరిగాయి.

Gold Loan: బంగారం ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య మనుషులు బంగారం కొనాలంటే కష్టమే. అందులోనూ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవి బాధత్యలు స్వీకరించినప్పటి నుంచి బంగారం ధరలు ఇంకా పెరుగుతున్నాయి. టారిఫ్‌లు విధించడంతో వీటి ధరలు ఇంకా ఎక్కువగా పెరిగాయి. అయితే బంగారం ధరలు పెరగడంతో చాలా మంది కొనలేకపోతున్నారు. తులం బంగారం లక్షపైనే ఉంది. దీంతో బంగారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉన్న బంగారాన్నే ఇతరులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో బంగారాన్ని ఎవరికి ఇవ్వకుండా కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బంగారం అవసరం ఉంటుందని ధరలు పెరుగుతాయని చాలా మంది అమ్మకుండా ఉంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి బంగారం అమ్మితే మళ్లీ కొనే పొజిషన్లో లేమని అంటున్నారు. ఈ క్రమంలో బంగారం లోన్ కూడా పెడుతున్నారు. బంగారం ఉండటంతో పాటు అవసరానికి కూడా డబ్బు చేతికి అందుతుందని చేస్తున్నారు. అయితే బంగారం లోన్ పెట్టేటప్పుడు ప్రతీ ఒక్కరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
Read also: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
బంగారం లోన్ తీసుకునే ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం.. అది ఆర్బీఐ, ఎన్బీఎఫ్సీ నుంచి ఆమోదించిన లోన్ తీసుకుంటున్నారా లేదా చూడాలి. అలాగే కాస్త సెక్యూరిటీ ఉన్న కంపెనీల నుంచి మాత్రమే లోన్ తీసుకోండి. అయితే బంగారం లోన్ విషయంలో ఒక్కో బ్యాంక్ వడ్డీ రేట్లు ఒక్కోలా ఉంటాయి. కొన్ని బ్యాంకులు 7% తీసుకుంటే.. మరికొన్ని 15% వరకు తీసుకుంటాయి. కాబట్టి మీకు ఎక్కడ అయితే తక్కువగా ఉంటుందో.. అక్కడే బంగారం లోన్ తీసుకోండి. దీంతో పాటు కొందర తక్కువ వడ్డీ అని చెబుతారు. కానీ ప్రాసెసింగ్ ఫీజు, సర్వీస్ ఛార్జ్, డోర్‌స్టెప్ ఫీజు వంటివి వసూలు చేస్తుంటారు. అయితే మీరు బంగారం లోన్ తీసుకునే ముందు తప్పకుండా ఈ వివరాలు తెలుసుకోండి. లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనివల్ల మీకు అప్పుల భారం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఆర్బీఐ రూల్స్ ప్రకారం 75 శాతం వరకు లోన్ పొందవచ్చు. మీరు పెట్టే బంగారం బట్టి లోన్ ఇస్తారు. అయితే బంగారం లోన్ గడువు కూడా సాధారణంగా ఉంటుంది. 6 నుంచి 24 నెలల వరకు మాత్రమే ఈ లోన్ ఉంటుంది. సరైన సమయంలో మాత్రం మీరు కట్టకపోతే మాత్రం బంగారం వేళానికి వెళ్తుంది. కాబట్టి మీరు అన్ని తెలుసుకుని బంగారం లోన్ తీసుకోండి.
Read Also: సివిల్స్ రిజల్ట్స్.. టాప్ 10 ర్యాంకర్ల లిస్ట్ ఇదే
బంగారం లోన్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించడం కూడా ముఖ్యం. ఆ లోన్‌కి భద్రత ఉందా? లేదా? అనే విషయం కూడా చెక్ చేసుకోండి. ఒప్పందాన్ని కూడా చదువుకోండి. ఎందుకంటే బంగారం లోన్ తీసుకునేటప్పుడు కొందరు తప్పుడు రాతలు రాస్తారు. కాబట్టి సంతకం చేసే ముందు అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా చదివిన తర్వాతే బంగారం లోన్ తీసుకోండి. దీనివల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావు. చాలా మందికి కొన్ని విషయాలు తెలియక బంగారం లోన్ తీసుకుంటారు. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు కొనకూడని వస్తువులు ఇవే
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ ముందు కొన్నారో.. నష్టపోక మానరు
-
Golden ATM: గోల్డెన్ ఏటీఎం.. బంగారం వేస్తే అకౌంట్లోకి డబ్బులు
-
Top up loan: టాప్ అప్ లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తప్పనిసరి
-
BSNL: బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్.. బెనిఫిట్స్ తెలిస్తే రీఛార్జ్ చేయకుండా ఉండలేరు
-
Spiritual: ఈ తేదీల్లో పుట్టిన వారు బంగారం వేసుకుంటే.. అంతే సంగతి