Pak vs Ind: దాయాది దేశానికి ఎగుమతులు కట్.. దేశంలో భారీగా తగ్గనున్న ధరలు

Pak vs Ind: జమ్మూకశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో 28 పర్యాటకులు మృతి చెందారు. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని ఉగ్రదాడి చేశారు. అయితే టూరిస్ట్‌లను చంపడంతో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌తో ఉన్న అన్ని అనుబంధాలను పూర్తిగా తెంచుకోవాలని భావిచింంది. ఈ క్రమంలో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎన్నో దశాబ్దాల కిందటి ఒప్పందం రద్దు చేయడంతో పాక్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.1960లో జరిగిన ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల పాక్ పూర్తిగా ఎడారిగా మారిపోనుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చైనాలో పుట్టిన సింధూ నది భారత్ నుంచి ప్రవహించి.. పాకిస్థాన్ చేరుతుంది. అయితే పాకిస్థాన్ వ్యవసాయం, గృహ అవసరాలకు ఈ సింధూ నది జలాలను ఉపయోగిస్తుంది. అయితే ఈ రెండు దేశాల నుంచి సింధూ నది ప్రవహించడంతో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చారు. ఇప్పుడు ఆ నీరు ఆపేస్తే పాక్ వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే వీటితో పాటు వాఘ బోర్డర్‌ను కూడా ఇండియా క్లోజ్ చేసేసింది. పాక్‌కు మొత్తం ఎగుమతులను భారత్ ఆపేసింది. అయితే పాక్‌కు భారత్ ఎగుమతులు ఆపేయడం వల్ల దేశంలో కొన్ని వస్తువులు ధరలు భారీగా తగ్గనున్నాయి. మరి ఆ వస్తువులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
పాక్‌కు భారత్ బాస్మతీ రైస్‌ను ఎక్కువగా ఎగుమతి చేస్తోంది. అయితే ఇప్పుడు పూర్తిగా ఎగుమతులు ఆపేయడంతో దేశంలో ఈ ధరలు భారీగా తగ్గనున్నాయి. ప్రస్తుతం దేశంలో బాస్మతీ రైస్ ధర ఎక్కువగానే ఉంది. ఎగుమతులు ఆగిపోవడంతో.. వీటి ధరలు అధికంగా తగ్గుతాయి. అలాగే పాకిస్థాన్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయి. ఎందుకంటే భారత్ దిగుమతి చేయకపోతే.. వీటికి లోటు ఏర్పడుతుంది. దీనివల్ల పాక్‌లో ధరలు భారీగా పెరుగుతాయి. వీటితో పాటు మందులు కూడా దేశంలో భారీగా తగ్గుతాయి. ఎందుకంటే అధిక మొత్తంలో పాక్‌కి భారత్ మందులను కూడా ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు అన్ని ఆగిపోవడంతో వీటి ధరలు దేశంలో తగ్గుతాయి. అదే విధంగా పాకిస్థాన్‌లో మందుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అయితే దేశంలో పత్తి, లెదర్, టెక్స్టైల్స్ ధరలు కూడా తగ్గనున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్ కష్టాల్లో ఉంది. కొన్ని ప్రాంతాలు ఆకలితో అలమటిస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు పూర్తిగా ఎగుమతులు ఆపేస్తే.. పాక్‌లో ధరలు పెరిగి.. భారత్‌లో తగ్గనున్నాయి.
ఇప్పటికే సింధూ నదీ జలాల నీటిని భారత్ ఆపేసింది. 1960లో తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కు, పశ్చిమం వైపు ఉన్న సింధు, చీనాబ్, జీలం నదులపై పాకిస్థాన్‌కు హక్కు ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సింధు నదిలో 20 శాతం నీటిని ఇండియా అవసరాలకు ఉపయోగించుకుంటుంది. 80 శాతం నీటిని పాకిస్తాన్ వినియోగించుకోవచ్చు. అయితే ఈ సింధూ నది వాటర్ ఆగిపోతే మాత్రం పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి పాకిస్థాన్ పరిస్థితి బాగులేదు. ద్రవ్యోల్బణం భారీగా పడిపోయింది. ఇప్పటికీ అక్కడ ఆకలి చావులు ఎక్కువ అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఈ నీటిపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది. అక్కడ ఉన్న పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు అయితే సింధూ జలాల నీరు ప్రధాన వనరు. పాక్‌లో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు చాలా తక్కువ నీటి వనరులు ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఆగిపోతే మాత్రం ఆ ప్రాంతాలన్నీ ఒక్కసారిగా ఎడారిగా మారిపోతాయి. ఆఖరికి తాగు నీటికి కూడా ఇబ్బంది వస్తుందని అంచనా వేస్తున్నారు.