Vastu Tips: ఈ వస్తువులను ఫ్రిడ్జ్‌పై పెట్టారో.. మీకు సమస్యలు తప్పవు
కొందరు తెలిసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే వీటివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ప్రతీ ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు అనేవి ఉంటాయి. కొందరు వీటిని పాటించరు. కానీ మరికొందరు మాత్రం వీటిని పాటిస్తుంటారు.

Vastu Tips: కొందరు తెలిసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే వీటివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ప్రతీ ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు అనేవి ఉంటాయి. కొందరు వీటిని పాటించరు. కానీ మరికొందరు మాత్రం వీటిని పాటిస్తుంటారు. అయితే ప్రతీ ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది ఈ రోజుల్లో తప్పనిసరి అయిపోయింది. ఎవరో కొందరి ఇంట్లో మాత్రమే ఫ్రిడ్జ్ ఉండదు. కానీ చాలా మంది వంటలు, పాలు, కూరగాయలు ఇలా కొన్ని అవసరాల కోసం ఫ్రిడ్జ్ వాడుతారు. అయితే ఫ్రిడ్జ్ ఉంటే కేవలం అది మాత్రమే ఉండకుండా దానిపైన ఎన్నో వస్తువులు ఉంచుతారు. ఉదాహరణకు డబ్బులు, మొక్కలు, మందులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తువులు పెడతారు. అయితే తెలిసో తెలియక పెట్టిన కొన్ని వస్తువుల వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే తెలిసో తెలియక చేసిన తప్పుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొ్ంటారు. మరి ఫ్రిడ్జ్‌పై పెట్టకూడని ఆ వస్తువులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
మందులు
చాలా మంది మందులు ఎక్కడైనా పెడితే దొరకవని ఎక్కువగా ఫ్రిడ్జ్‌పై పెడుతుంటారు. అయితే వాస్తు ప్రకారం ఫ్రిడ్జ్‌పై మందులు పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా మందులు పెడితే ఇంట్లోకి ఎక్కువగా ప్రతికూల శక్తి వస్తుందని అంటున్నారు. దీనివల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మీరు మందులకు ఏదైనా ప్లేస్‌లో డబ్బాలో పెట్టడం మంచిది. అంతే కానీ ఇలా ఫ్రిడ్జ్‌పై అసలు పెట్టవద్దు.
Read Also: తక్కువ బడ్జెట్‌లో సందర్శించాల్సిన అందమైన దేశాలివే
అవార్డులు
ఇంటికి వచ్చిన వారికి కనిపించడానికి కొందరు అవార్డులను ఫ్రిడ్జ్‌పై పెడుతుంటారు. అయితే ఇలా ఫ్రిడ్జ్‌పై పెట్టడం ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు. వీటివల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిడ్జ్‌పై ఇలాంటి అవార్డులను పెట్టవద్దు. అందం కోసం వీటిని పెట్టి ఇంట్లోకి కోరి సమస్యలను తెచ్చుకోవద్దు.
డబ్బులు
ఫ్రిడ్జ్‌పై అందరూ ఎక్కువగా పెట్టే వాటిలో డబ్బులు ఒకటి. ముఖ్యంగా మహిళలు అయితే వెంటనే చేతికి అందుతాయని ఎక్కువగా పెడుతుంటారు. ఫ్రిడ్జ్‌పై ఇలా డబ్బులు పెడితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీనివల్ల ఇంట్లో ఉన్న డబ్బు అంతా కూడా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉందని పండితులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిడ్జ్‌పై అసలు డబ్బులు పెట్టవద్దు.
Read Also: బియ్యం వాటర్‌తో ఫేస్ గ్లో.. ఎలాగంటే?
మొక్కలు
అందం కోసం చాలా మంది ఫ్రిడ్జ్‌పై మొక్కలు పెట్టకూడదు. వీటివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ సోకుతుంది. అలాగే ఆ మొక్కలు కూడా సరిగ్గా పెరగవు. ఆరోగ్యం కోసం మొక్కలు పెడతారు. కానీ వీటివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలా తెలిసో తెలియక చేసిన కొన్ని తప్పులు వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఫ్రిడ్జ్ విషయంలో ఈ మిస్టేక్స్ వద్దు. ఫ్రిడ్జ్‌పై ఎలాంటి వస్తువులు లేకుండా ఖాళీగా, శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అంతే కానీ ఎక్కడా లేని వస్తువులు అన్ని కూడా వేసి ఇంట్లోకి సమస్యలను తెచ్చుకోకూడదని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Zodiac Signs: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
-
Lizards: ఈ చిట్కాలు పాటిస్తే.. ఇంట్లో బల్లులు పరార్
-
Pressure Cooker: ప్రెషర్ కుక్కర్లో ఇవి కుక్ చేస్తున్నారా.. మీరు పైకి పోవడం ఖాయం
-
Electric Car: 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు అదిరిపోయింది.. చూస్తే కొనకుండా ఉండలేరు
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
-
Rahu and Ketu: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు