Viral Video : వర్షం తెచ్చిన విషాదం.. పంటను కాపాడుకోవడానికి రైతు ఆరాటం.. వైరల్ వీడియో

Viral Video : వర్షం అంటే ఇష్టం ఉండని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఆకాశం నుండి నేలపై పడే వర్షపు చినుకులు అందరికీ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. దాదాపు ప్రతి ఒక్కరూ వర్షం కోసం ఆత్రంగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఈ నీరు కేవలం మనిషిని మాత్రమే సంతోషపరచదు. వాతావరణాన్ని కూడా చల్లగా మారుస్తుంది. అయితే, వర్షపు చినుకులు అందరికీ నచ్చకపోవచ్చు. చాలా మందికి వరుణుడు కొన్ని ఘటనల్లో శత్రువుగా మారిపోతాడు. వారి మీద పగబట్టినట్టు పూర్తిగా నాశనం చేస్తాడు. వర్షాలు సమృద్ధిగా పడితేనే పంటలు పండుతాయి. అలా అని ఎక్కువ పడితే కూడా కష్టమే. వర్షం ఎప్పుడూ కూడా రైతుకు నీరు కావాల్సినప్పుడు అది రాదు. కానీ వద్దు అనుకున్నప్పుడు మాత్రం మేఘాలు కురుస్తాయి. వారి కష్టాన్ని పాడు చేస్తాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది చాలా మందిని భావోద్వేగానికి గురిచేస్తోంది.
Read Also:Electric Vehicle Battery : తక్కువ ఖర్చు.. ఎక్కువ దూరం.. బ్యాటరీ టెక్నాలజీలో గేమ్ ఛేంజర్
వైరల్ అవుతున్న ఈ వీడియో ఏదో ఒక మార్కెట్లోనిదిగా ఉంది. అక్కడ తన పంటను విక్రయించడానికి వచ్చిన రైతు తన కళ్లముందే వర్షపు దెబ్బకు తన శ్రమంతా వృథా అవుతుంటే గుండె పగిలినంత బాధపడ్డాడు. అయితే, ఆ సమయంలో అతను తన పంటను కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ అతను అందులో విజయం సాధించలేక నిస్సాహయుడిగా నిలిచిపోయాడు. ఆ విషయం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వైరల్ వీడియో ప్రజలను కదిలించింది.
मजबूर किसान बारिश के बीच अपनी मूंगफली की फसल को बहने से बचाने की कोशिश कर रहा है। pic.twitter.com/gnWfRcSVGS
— Ritesh Mahasay (@MahasayRit11254) May 16, 2025
Read Also:MG Windsor EV: వావ్! రూ.13 లక్షలకే అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. క్రెటా, కర్వ్కు షాక్!
వీడియోలో రైతు తడుస్తూ నిస్సహాయంగా నేలపై కూర్చుని వర్షాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. తన పంటను కాపాడుకోవడానికి దానిని అటూ ఇటూ కదుపుతున్నాడు. దాని వల్ల నష్టం కొద్దిగా తగ్గుతుందేమో అని ఆశించాడు. కానీ వర్షపు చినుకులు అంత వేగంగా పడుతున్నాయి. అతని శ్రమంతా నీటితో పాటు కొట్టుకుపోతున్నట్లు కనిపిస్తోంది. 39 సెకన్ల ఈ చిన్న క్లిప్ అక్కడితో ముగుస్తుంది. కానీ రైతును చూసి ప్రజలు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ వీడియోను @MahasayRit11254 అనే యూజర్ X (ట్విట్టర్)లో షేర్ చేయగా, ప్రజలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
-
Dhruv Jurel: ఇండియాకు ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా
-
Asia Cup 2025: ఆసియా కప్ లో భారత్ పాకిస్థాన్ వర్సెస్ మ్యాచ్ పై ఏసీసీ క్లారిటీ
-
Shikhar Dhawan: భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ పై ఉత్కంఠ.. ధావన్ ఏమన్నాడంటే
-
Mohamed Muizzu Praises India: భారత్ పై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రశంసలు
-
Eng Vs Ind 4th Test: నాలుగో టెస్ట్ గెలిస్తేనే.. లేకుంటే సిరీస్ ఖేల్ ఖతం
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్