Zodiac signs: రాహు కేతు మార్పులు.. ఈ రాశుల వారికి గడ్డు కాలమే

Zodiac signs: రాహు కేతువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటివల్ల కొందరికి మంచి జరిగితే మరి కొందరికి చెడు జరుగుతుంది. అయితే రాహు కేతు మార్పుల వలల మే నెలలో కొన్ని రాశుల వారికి గడ్డు కాలమేనని చెప్పవచ్చు. ఎందుకంటే వీటి స్థానాల్లో కొన్ని మార్పులు రావడం వల్ల రాశి చక్రంలోని కొన్ని రాశుల వారికి ఇబ్బందులు వస్తాయి. అసలు ఏ పని చేపట్టినా కూడా మంచి జరగదు. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అన్ని పనుల్లో కూడా ఆటంకం ఏర్పడుతుంది. అయితే ఈ రాహు కేతు మార్పుల వల్ల ఏయే రాశుల వారికి గడ్డు కాలమో ఈ స్టోరీలో చూద్దాం.
మేష రాశి
ఈ రాశి వారికి రాహు, కేతువుల వల్ల ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి. వీటితో పాటు ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి. బంధువులు, స్నేహితులతో గొడవలు ఎక్కువ అవుతాయి. ఏ విషయంలో అయినా కూడా కాస్త ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండండి.
మిథున రాశి
ఈ రాశికి వారికి కూడా ఈ నెల కాస్త ఆదాయం తగ్గుతుంది. అలాగే ఉద్యోగం, వ్యాపారంలో సమస్యలు వస్తాయి. ఏ పని చేసినా కూడా కాస్త ఆలోచించి చేయాలి. ముఖ్యంగా అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఆస్తి వివాదాలు వస్తాయి. ఇతరులతో కాస్త గొడవలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆలోచించి ప్రతీ విషయంలో నిర్ణయం తీసుకోవాలి.
సింహ రాశి
సింహ రాశి వారికి మే నెలలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. చిన్న విషయాలకు కూడా ఎక్కువగా టెన్షన్ అవుతారు. అలాగే అవసరానికి డబ్బు అందదు. దీనివల్ల కాస్త సమస్యలు వస్తాయి. ఉద్యోగులకు కూడా సమస్యలు వస్తాయి. అధికారులతో దురుసుగా ప్రవర్తించకూడదు. ఆచితూచి వారితో వ్యవహరించాలి. అప్పుడే కాస్త ఇబ్బందులు తగ్గుతాయి.
కన్యా రాశి
ఈ నెలలో ఆరోగ్యం, ప్రయాణాలు వంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగంలో సమస్యలు ఎక్కువగా వస్తాయి. జీవిత భాగస్వామితో అయితే గొడవలు వస్తాయి. అలాగే ఆర్థిక సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా సంపద నష్టపోవచ్చు. కాబట్టి మే నెలలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి పూర్తిగా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అలాగే కుటంబ సభ్యుల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. దీనివల్ల ఇంట్లో ఆందోళనలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. అలాగే శుభకార్యాల్లో ఆటంకాలు వస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి.
మీన రాశి
కాలసర్ప దోషం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటితో పాటు ముఖ్యంగా వ్యక్తిగతంగా కూడా కాస్త ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ రాశి వారికి కాస్త ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో సమస్యలు వస్తాయి. ప్రతీ విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. లేకపోతే ఇంకా ఎక్కువగా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పండితులు అంటున్నారు.
-
Early Morning: ఉదయం ఈ తప్పులు చేస్తే.. సంపద గోవిందా
-
Zodiac Signs: ఈ రాశుల వారి ఆయుధం చిరునవ్వే
-
Kasi: ఈ కాశీలో స్నానాలు చేస్తే.. పాపాల నుంచి విముక్తి
-
Zodiac Signs: అక్షయ తృతీయ నుంచి ఈ రాశుల వారికి పట్టింది బంగారమే
-
Zodiac Signs: ప్రేమ విషయంలో ఈ రాశుల వారంతా అదృష్టవంతులు ఎవరూ లేరు భయ్యా
-
Rahu and Ketu: రాహు కేతువుల మార్పు.. వీరికి ఇక తిరుగే లేదు