Vastu Tips: ఇంట్లో ఈ మూలన శంఖం ఉంచితే.. ఇక మీకు తిరుగే ఉండదు

Vastu Tips:
హిందూ సంప్రదాయాలు, ఆచారాలు పాటించే వారు తప్పకుండా వాస్తు నియమాలు పాటిస్తారు. ముఖ్యంగా అన్ని విధాలుగా మంచి జరుగుతుందంటే మాత్రం తప్పకుండా కొన్ని నియమాలను పాటిస్తారు. అయితే హిందూ సంప్రదాయంలో శంఖానికి ఓ ప్రత్యేకత ఉంది. కొందరు ఇంట్లో ఏదైనా శుభకార్యం ప్రారంభించేటప్పుడు శంఖం పూరిస్తారు. అలాగే వీటిని ఇంట్లో ఎంతో భక్తితో పూజిస్తారు. అలాగే ఆలయాల్లో కూడా పూజ ప్రారంభించే ముందు శంఖం ఊదడం కూడా ఓ ఆనవాయితీ. అయితే శంఖానికి హిందువులు పూజలు కూడా నిర్వహిస్తారు. అయితే ఇంట్లో ఓ మూలన శంఖం ఉంచడం వల్ల మంచి జరుగుతుందట. అది కూడా సరైన పద్ధతిలో ఉంచితేనే ఫలితం ఉంటుంది. ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయి. అయితే ఇంట్లో ఏ మూలన శంఖం ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఇంట్లో శంఖాన్ని సరైన స్థలంలో ఉంచితేనే మంచి ఫలితాలను ఇస్తుంది. లేకపోతే ఇంటికి దురదృష్టం వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. శంఖం శబ్దం చుట్టూ ఉండే వాతావరణాన్ని పవిత్రంగా మారుస్తుందట. అందుకే శంఖాన్ని ఇంట్లో తప్పకుండా ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు. శంఖాన్ని ఈశాన్య మూలలో ఉంచడం వల్ల అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా శంఖాన్ని నోరు పైకి చూసే విధంగా పెట్టాలి. ఇలా పెడితే శంఖం నుంచి పాజిటివ్ శక్తి వస్తుంది. ఇంట్లో ఉండే వాతావరణం అంతా కూడా సానుకూలంగా మారుతుంది. ఇంట్లో అంతా కూడా ప్రతికూల శక్తి ఉంటుంది. ఏ పని అనుకున్నా కూడా సక్రమంగా జరుగుతుంది. కష్టాలు, బాధలు అన్ని కూడా తీరిపోతాయని నమ్ముతారు. ప్రతీ ఒక్కరి ఇంట్లో శంఖం ఉండాలని పండితులు చెబుతున్నారు. అయితే శంఖాన్ని మీరు పెట్టే ముందు నీటితో శుభ్రం చేయాలి. అలాగే శంఖాన్ని ఊదడానికి ముందు కూడా నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా క్లాత్‌తో తుడిచి, గుడ్డతో ఆరబెట్టాలి. అయితే దీన్ని ఈశాన్య మూలన మాత్రమే ఉంచాలి. దీనివల్ల ఇంటి వాతావరణం స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది. అదే మీరు దాన్ని సరైన ప్లేస్‌లో ఉంచకపోతే మాత్రం తప్పకుండా సమస్యలు వస్తాయి. తలెత్తుతాయి. శంఖాన్ని అన్ని దేవుళ్లుగా కొలుస్తారు. శంఖం నుంచి వచ్చే శక్తి ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా చేస్తాయి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.