Money: ఈ ప్లేస్లో పుట్టుమచ్చ ఉంటే.. లెక్కలేనంత ధనం మీ సొంతం

Money: మనిషి అన్న తర్వాత బాడీలో ఎక్కడో ఒక దగ్గర పుట్టుమచ్చలు తప్పకుండా ఉంటాయి. అయితే ఈ పుట్టుమచ్చలు పుట్టుకతోనే ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే చిన్న మచ్చలు. జ్యోతిష్య శాస్త్రానికి దీనికి కూడా లింక్ ఉంది. ఈ పుట్టు మచ్చలు బట్టి వారి ప్రవర్తన, జీవితంలో సమస్యలు అన్ని కూడా ఉంటాయి. కొందరు వీటిని నమ్ముతారు. మరికొందరు ఇలాంటి వాటిని అసలు పట్టించుకోరు. అయితే బాడీలో కొన్ని స్థానాల్లో పుట్టుమచ్చలు ఉండటం వల్ల భాగ్యం, బుద్ధి, వైభోగం వంటివి కలుగుతాయని అంటున్నారు. అయితే బాడీలో ఏ ప్లేస్లో పుట్టుమచ్చలు ఎలాంటి ప్రతిఫలాన్ని అందిస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: ENG vs IND: త్వరలోనే ఇంగ్లాండ్ సిరీస్.. ఫైనల్ జట్టు ఇదే
బాడీలో పుట్టు మచ్చలు కుడి కణతపై, ఎడమ కణత, కుడి కనుబొమ్మ మీద, కుడి కంటిలో నల్ల గ్రుడ్డుకు ఎడమ భాగాన, కుడి కన్ను రెప్ప లోపలి భాగమున, నుదరు కుడి భాగమున, ముక్కుకి కుడివైపున, గడ్డమునకు మధ్య భాగమున, పెదవి క్రింద, గడ్డమునకు కుడి భాగమున, కంఠమునకు రెండు వైపుల, రొమ్మునకు కుడి భాగమున ఉంటే అదృష్టం కలసి వస్తుంది. వీరికి అసలు డబ్బు సమస్యలు ఉండవు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దీంతో పాటు కుడి అర చేయి చిటికెన వ్రేలు క్రింద, మణి కట్టునకు ఇరువైపుల, కుడి తొడ మీద ఉన్నా, వృషణముల మీద, కుడి మోకాలు మీద పుట్టుమచ్చలు ఉంటే మాత్రం సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోయి ధనవంతులు అవుతారని పండితులు అంటున్నారు. ఈ ప్లేస్లో పుట్టు మచ్చ ఉన్నవారికి అసలు డబ్బు సమస్యలు ఉండవు. అవసరానికి డబ్బు అందుతుందని పండితులు అంటున్నారు.
కొందరికి నుదురు భాగం విశాలంగా ఉంటుంది. ఇలా కుడి వైపు పుట్టుమచ్చ ఉంటే అనుకోకుండా ధనప్రాప్తి అవుతుంది. కుడి కణత మీద కూడా ఉంటే వారికి వారసత్వం వల్ల లాభం వస్తుంది. అలాగే అనుకోకుండా లాభం కలుగుతుంది. కొందరికి కుడి కంటిలో పుట్టుమచ్చ ఉంటుంది. ఇలా ఉన్నవారికి భోగ భాగ్యములు అనుభవిస్తారు. కంఠమునకు పైభాగంలో ఉంటే ధనం కుప్పలు, తెప్పలుగా వస్తుంది. కుడి అరచేతి ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే లాటరీలో డబ్బు వస్తుంది. కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే స్త్రీ వల్ల ఆస్తి లభిస్తుంది. కుడి కనుబొమ్మలపై పుట్టు మచ్చలు ఉంటే మాత్రం భార్య వల్ల ధన లాభం వస్తుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
Plants at home: ఈ మొక్కలు పెంచితే.. ప్రపంచమంతా అందం మీ ఇంట్లోనే!
-
Youtube new rules: యూట్యూబర్లకు షాకింగ్ న్యూస్.. ఈ రూల్స్ పాటిస్తేనే డబ్బులు లేకపోతే కట్!
-
Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం
-
Ants: ఇంట్లోకి చీమలు అధికంగా వస్తుంటే.. ఇంత అదృష్టమా!
-
Mirror: ఇంట్లో ఇక్కడ అద్దం పెడితే.. ఇళ్లంతా డబ్బు మయం
-
Andhra Pradesh: తల్లికి వందనం రూ.13 వేలు.. మరి మిగతా రూ.2 వేల పరిస్థితి ఏంటి?