Champions Trophy: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్

Champions Trophy:
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. మొదటి రెండు మ్యాచ్‌లలో పాకిస్థాన్ ఓడిపోవడంతో ట్రోఫీ నుంచి ఔట్ అయ్యింది. ఫిబ్రవరి 19వ తేదీన పాకిస్థాన్, దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైంది. ఈ ట్రోఫీలో పాకిస్థాన్ మొదటి మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఆ తర్వాత భారత్‌తో పాక్ మ్యాచ్ ఆడగా ఇందులో కూడా ఘోర పరాజయం పాలైంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రస్తుతం గ్రూప్ ఎలో జట్లు తలపడుతున్నాయి. ఇందులో ప్రతీ జట్టు వేర్వేరు జట్లుతో మ్యాచ్ ఆడుతాయి. అప్పుడు ప్రతీ జట్టు తప్పకుండా రెండు మ్యాచ్‌లు గెలవాలి. అప్పుడే అవి సెమీస్‌కి వెళ్తాయి. అయితే పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో సెమీస్ ఆశలు పూర్తిగా గాలిలోకి కలిసిపోయాయి. అయితే ఫిబ్రవరి 24వ తేదీన న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. బంగ్లాదేశ్ కూడా భారత్‌తో మొదటి మ్యాచ్ ఓడిపోయింది. బంగ్లాదేశ్ నిన్న జరిగిన మ్యాచ్ గెలిస్తేనే.. దీంతో పాటు పాకిస్థాన్ సెమీస్‌కు వెళ్తాయి. కానీ బంగ్లాదేశ్ న్యూజిలాండ్‌పై విజయం సాధించలేదు. దీంతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు ఆవిరి అయిపోయాయి. టోర్నీ స్టార్ట్ అయిన 5 రోజులకే పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్ అయ్యింది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లా ఘోర పరాజయం పాలైంది. దీంతో బంగ్లాదేశ్, పాకిస్థాన్ టోర్నీ నుంచి తప్పుకోగా.. భారత్, న్యూజిలాండ్ సెమీస్‌కు చేరాయి.
భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలవాలని భావించింది. కానీ టీమిండియా బౌలర్లు గట్టిగానే బౌలింగ్ వేశారు. ఇండియా బౌలర్ల దాటికి పాక్ జట్టు తట్టుకోలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ మొదటి నుంచి ఆచితూచి బ్యాటింగ్ చేసింది. కానీ చివరకు ఓడిపోయింది. ఓపెనర్లను టీమిండియా బౌలర్లు 9.2 ఓవర్లలోనే ఔట్ చేశారు. మ్యాచ్ ప్రారంభంలోనే ఇద్దరే బ్యాటర్లు ఔట్ కావడంతో పాకిస్థాన్ ఓడిపోవడానికి గల కారణాల్లో ఒకటి. మెయిన్ పిల్లర్ అనుకునే బాబర్ అజమ్ కూడా ఔట్ అయ్యాడు. దీంతో పాక్ జట్టు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాస్త తగ్గాయని చెప్పవచ్చు. మధ్య ఓవర్‌లో పాకిస్థాన్ జట్టుకి టీమిండియా అసలు పరుగులు ఇవ్వలేదు. రన్ రేటు చాలా తక్కువగా ఉండేది. పాక్ బ్యాటర్లు కూడా ఆచితూచి ఆడారు. కాస్త గట్టిగా కొట్టినా కూడా ఔట్ అవుతారు ఏమోనని భయంతో పెద్దగా పరుగులు చేయలేదు. మొదటిలో పాకిస్థాన్ జట్టు బాగానే ఆడింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో 241 పరుగులతో పాకిస్థాన్ జట్టు ఆలౌట్ అయ్యింది. తమ గడ్డ మీద జరుగుతున్న టోర్నీలో మొదటి 5 రోజులకే ఔట్ కావడంతో పాక్ క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్