Champions Trophy: సెమీస్‌లో కంగారుతో తలపడనున్న టీమిండియా.. గెలిచేదెవరు?

Champions Trophy:
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగింది. గ్రూప్ ఎ దశలో మ్యాచ్‌లు జరగ్గా.. ఇప్పటికే పాక్, బంగ్లాదేశ్ నిష్క్రమించాయి. అయితే దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్ మీద విజయం సాధించింది. మొదటి మూడు మ్యాచ్‌లలో విజయం సాధించిన న్యూజిలాండ్ భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో భారత్ సెమీ ఫైనల్‌కి చేరింది. వరుసగా భారత్ విజయాలు సాధించి సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. న్యూజిలాండ్ ఓడిపోయి గ్రూప్ ఎలో రెండవ స్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్ బీలో టాప్‌లో ఉన్న దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనుంది.
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 44 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయగా.. నిర్ణీత ఓవర్లలో 249 పరుగులు చేసింది. 250 టార్గెట్ దిగిన న్యూజిలాండ్ జట్టు 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌లో తలపడనుంది. కొన్ని భద్రతా కారణాల వల్ల టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లలేదు. దీంతో మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నారు. అయితే భారత్‌తో జరిగే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయి. దీంతో సెమీస్ కూడా దుబాయ్‌లోనే జరుగుతుందని ముందుగానే నిర్ణయించారు.
టీమిండియా బ్యాటింగ్‌లో కాస్త తడబడింది. వరుసగా కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరారు. కేవలం శ్రేయస్ అయ్యార్ 79 పరుగులు చేశాడు. హార్డిక్ పాండ్యా 45 పరుగులతో కీలక టీమిండియా కీలక స్కోర్ చేశారు. 300వ వన్డే ఆడుతున్న విరాట్ కోహ్లీ 11 పరుగుల వద్ద గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్‌కి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. కానీ శ్రేయస్ అయ్యర్, హార్డిక్, అక్షర్ పటేల్ మళ్లీ మ్యాచ్‌ని మలుపు తిప్పారు. పాండ్యా ఫోర్లు, సిక్స్‌లు కొట్టాడు. కానీ చివరకు క్యాచ్‌తో ఔట్ అయ్యాడు. అయితే న్యూజిలాండ్ జట్టు మొదటి నుంచి బాగానే బ్యాటింగ్ చేసింది. కేన్ విలియమ్సన్ 120 బంతుల్లో 81 పరుగులు చేశాడు. కానీ కివీస్ జట్టు 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఆస్ట్రేలియాతో సెమీస్‌లో తలపడనుంది. అయితే ఆస్ట్రేలియాకు మంచి క్రికెట్ చరిత్ర ఉంది. ఆస్ట్రేలియా, భారత్ అంటే మధ్య పెద్ద పోటీ అని చెప్పవచ్చు. అయితే కంగారుతో టీమిండియా సెమీస్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే ఆసక్తితో ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్