Gautam Gambhir: పంత్‌ని కాదని.. రాహుల్‌ను గంభీర్ సెలక్ట్ చేయడానికి ముఖ్య కారణం అదేనా!

Gautam Gambhir:
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. అయితే ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. అయితే రిషబ్ పంత్‌కి బదులు కేఎల్ రాహుల్‌ను కోచ్ గౌతమ్ గంభీర్ ఎంచుకున్నాడు. అయితే గౌతమ్ గంభీర్ కేఎల్ రాహుల్‌ను ఎంచుకోవడానికి ఓ బలమైన కారణం ఉందట. రిషబ్ పంత్ ఇప్పటి వరకు x ఫ్యాక్టర్‌లో నిరూపించుకోలేదు. స్పిన్ పిచ్‌లపై కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు. అందులోనూ దుబాయ్ వంటి పిచ్‌లపై బౌలర్లు పెట్టే పరీక్షను ఎదుర్కోవాలంటే కాస్త ఓపిక, మెరుగైన షాట్ సెలక్షన్, పరిణతి ఉండాలి. పంత్‌ది ఇంపల్సివ్ నేచర్. తన వికెట్ విలువ తెలుసుకోకుండానే ఔట్ అయిపోతాడు. దూకుడు మీద ఆడతాడు. కానీ టీమిండియాకి అవసరం అయినప్పుడు మాత్రం ఆడలేకపోయాడు. తొందరగా పరుగులు చేసి వికెట్లు పోగొట్టిన పరిస్థితులు చాలనే ఉన్నాయి. దీంతో గౌతమ్ గంభీర్ పంత్‌ను కాదని.. కేఎల్ రాహుల్‌కి ఛాంపియన్స్ ట్రోఫీలోకి అవకాశం ఇచ్చారు.
కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్ సందర్భాన్ని బట్టి కేఎల్ రాహుల్ ఆడతాడు. జట్టు అవసరాలను బట్టి రాహుల్ బ్యాటింగ్ ఉంటుంది. అదృష్టం బాలేక కేఎల్ రాహుల్ జట్టులో స్థిరమైన స్థానం సంపాదించు కోలేకపోయాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్రతిభను కనబర్చాడు. బ్యాటింగ్, కీపర్‌గా కూడా రాహుల్ బాగా ఆడాడు. దీంతో టీమిండియా ఇతన్ని వదులుకునే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు రాహుల్ తన ఆటతో గట్టెక్కించాడు. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్‌లో అయితే రాహుల్ ఆడిన తీరు అందరినీ కూడా ఆకట్టుకుంది. గౌతమ్ గంభీర్ నిర్ణయం వల్ల కేఎల్ రాహుల్‌ను తీసుకున్నారు. ఎలా ఆడుతాడో అని అందరూ కూడా ఆందోళన చెందారు. కానీ తన ఆట తీరుతో రాహుల్ ఒక మెట్టు పైకి ఎక్కడంతో పాటు గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టాడు. దీంతో పాటు రిషబ్ పంత్ ఆట తీరు కూడా ఒక మైనస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రిషబ్ పంత్ X ఫ్యాక్టర్‌లో కూడా తన ప్రతిభను చూపించలేకపోయాడు. ఇది కేఎల్ రాహుల్‌కి ప్లస్ అయ్యింది. ఈ సమయంలో కేఎల్ రాహుల్ కూడా మంచిగా ఆడటంతో ప్లస్ అయ్యింది.