Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Sports News »
  • Good News For Mumbai Fans Jasprit Bumrah Coming

Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా

Jasprit Bumrah ఐపీఎల్ ప్రారంభం కాకముందే.. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో బుమ్రా రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. ఎన్‌సీఏలోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.

Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
  • Edited By: kusuma,
  • Updated on April 6, 2025 / 01:36 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే శుభవార్త. ముంబై జట్టు స్టార పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి వెన్నెముక సమస్యతో ఇబ్బంది పడుతున్న బుమ్రా జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని ముంబై జట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ది లయన్ ఈజ్ బ్యాక్ అంటూ ముంబై ఇండియన్స్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో బుమ్రా సతీమణితో పాటు కొడుకు అంగద్ కూడా కనిపించాడు. కుమారుడు అంగద్‌కు బుమ్రా సతీమణి.. తన ఐపీఎల్ జర్నీ గురించి స్టోరీలా చెబుతున్నట్లు చూపించారు. బుమ్రా జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ముంబై జట్టుతో పాటు ఫ్యాన్స్ కూడా సంతోషపడుతున్నారు. ఇక బుమ్రాను తట్టుకోవడం కష్టమని అంటున్నారు. అయితే బుమ్రా జట్టులోకి చేరాడు. ఏ మ్యాచ్ నుంచి ఆడతాడనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. సోమవారం రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 13 వ తేదీన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో అయితే బుమ్రా తప్పకుండా ఆడుతాడు.

ఇదిలా ఉండగా ఐపీఎల్ ప్రారంభం కాకముందే.. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో బుమ్రా రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. ఎన్‌సీఏలోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో బుమ్రా బౌలింగ్ వేయలేకపోయాడు. ఇలా ప్రాక్టీస్ సమయంలో కూడా మళ్లీ ఎలాంటి ఫ్రాక్చర్ కాకుండా ఉండేందుకు బుమ్రా జాగ్రత్త పడ్డాడు. రోజురోజుకీ వర్క్ లోడ్ కూడా పెంచుతున్నారు. జనవరి మొదటి వారంలో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగింది. ఈ టోర్నీలో చివరి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా గాయపడ్డాడు. మ్యాచ్ మధ్యలో మైదానం నుంచి వెళ్లిపోయాడు. వెంటనే మన దేశానికి వచ్చి బెంగళూరులో చికిత్స తీసుకున్నాడు.

బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ సమయం దగ్గరకి వచ్చినా సరే గాయం నుంచి కోలుకోలేక పోయాడు. బుమ్రాకి ఎలాంటి ఇబ్బంది కూడా లేకపోయినా బౌలింగ్ అయితే చేయకూడదని వైద్యులు తెలిపారు. దీంతో ఛాంపియన్స్‌ ట్రోఫీకి కూడా బుమ్రా దూరం అయ్యాడు. ఇతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని తీసుకున్నారు. ఏది ఏమైనా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. అయితే ఐపీఎల్ సీజన్ తర్వాత భారత్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 5 సార్లు ట్రోఫీ గెలిచింది. కానీ ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయింది.

𝑹𝑬𝑨𝑫𝒀 𝑻𝑶 𝑹𝑶𝑨𝑹 🦁#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL pic.twitter.com/oXSPWg8MVa

— Mumbai Indians (@mipaltan) April 6, 2025

Tag

  • IPL 2025
  • Jasprit Bumrah
  • jasprit bumrah ipl 2025
Related News
  • Lords Test : లార్డ్స్ టెస్టులో కష్టాల్లో టీమిండియా.. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లిన శుభమన్ గిల్

  • IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు

  • Team India : మూడో టెస్టులో బూమ్రా ఆడడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్

  • Jasprit Bumrah : రెండో టెస్టుకు ముందు టీం ఇండియాకు గుడ్ న్యూస్.. బూమ్రా వచ్చేశాడు

  • Jasprit Bumrah : కెప్టెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిన బుమ్రా.. బీసీసీఐకి ‘నో’ చెప్పడానికి గల అసలు కారణం ఇదే!

  • IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us