IND vs NZ: అక్షరాల 69+ కోట్ల వ్యూస్.. ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్ వ్యూస్‌లలో రికార్డ్

IND vs NZ:
ప్రస్తుతం దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా జరుగుతోంది. భారత్‌తో పాటు యావత్ ప్రపంచం మొత్తం ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురు చూశారు. అయితే ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్‌లో ప్రసారం అవుతోంది. ప్రస్తుతం ఈ మ్యాచ్‌ను 69+ మంది వీక్షిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో ఎక్కువ మంది వీక్షించిన మ్యాచ్‌లో ఇదే టాప్. ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు చూస్తున్నారు. భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం భారత్ కష్టాల్లో ఉంది. ఓపెనర్లు రోహిత్, గిల్ ఔట్ కావడంతో కాస్త ఆందోళన మొదలైంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చిన వెంటనే పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహ పడుతున్నారు. టీమిండియా మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్. అలాంటిది టీమిండియా ఓడిపోతే కష్టమే. 32 ఓవర్లలో 145 పరుగులు టీమిండియా చేసింది. మొత్తం మూడు వికెట్లు ఉన్నాయి.
కివీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 251/7 కొట్టింది. దీంతో టీమిండియా టార్గెట్ 252 స్కోర్ కొట్టాలి. న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రాస్‌వెల్ (51*) రాణించగా.. రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34) స్కోర్ చేశారు. విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లేథమ్ (14), మిచెల్ శాంట్నర్ (8) పరుగులు మాత్రమే చేయగా.. నాథన్ స్మిత్ 0 (1) నాటౌట్‌గా నిలిచాడు. అయితే భారత్ బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టుదిట్టం చేశారు. కుల్‌దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా, షమి ఇద్దరు చెరో వికెట్ పడగొట్టారు.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
న్యూజిలాండ్ జట్టు
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్ ఆడుతున్నారు.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!