IND vs NZ: నేడే ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్.. ఈ కీలక పోరులో గెలిచేదెవరు?

IND vs NZ:
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యచ్ జరగనుంది. ఈ టోర్నీలో గ్రూప్ ఎ దశలో మ్యాచ్‌లు జరగ్గా.. ఇప్పటికే పాక్, బంగ్లాదేశ్ నిష్క్రమించాయి. అయితే సెమీస్‌కు భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే చేరుకున్నాయి. టీమిండియా మొదటి బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడగా 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత పాకిస్తాన్‌తో భారత్ తలపడగా.. 6 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్‌కు చేరింది. అయితే నేడు భారత్‌తో తలపడనున్న న్యూజిలాండ్ జట్టు మొదట పాకిస్థాన్‌ను, ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టును ఓడించింది. ఈ రెండు జట్లు వరుస మ్యాచ్‌లు గెలిచి సెమీస్‌కు చేరాయి.
ప్రస్తుతం గ్రూప్-ఎలో భారత్, న్యూజిలాండ్ రెండు కూడా 4 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. కానీ రన్ రేట్ పరంగా చూస్తే న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. న్యూజిలాండ్ నికర రన్ రేట్ 0.863 ఉండగా, భారతదేశం నికర రన్ రేట్ 0.647గా మాత్రమే ఉంది. మరి ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది చూడాలి. నేడు ఎవరు గెలిచి, సెమీస్‌కు చేరతారో చూడాలి. అయితే ఇప్పటి వరకు వన్డే క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్, భారత్ మధ్య 118 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 60 మ్యాచ్‌ల్లో గెలవగా.. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ట్రైగా నిలవగా మిగతా 7 మ్యాచ్‌లకు ఎలాంటి ఫలితం రాలేదు.
నేడు ఏ జట్టు గెలిస్తే ఆ దేశ జట్టు గ్రూప్ దశలో టాప్‌లో ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు గ్రూప్-బిలోని జట్టుతో తలపడుతుంది. గ్రూప్ బిలోని రెండవ స్థానంలో ఉన్న జట్టుతో సెమీ ఫైనల్‌లో తలపడుతుంది. అయితే భారత్ గెలిచిన ఫీల్‌లోనే ఉంది. న్యూజిలాండ్ కూడా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉంది. ఎలాగైనా ఈ టోర్నీలో విజయం సాధించాలని ఈ జట్టు చూస్తోంది. ఈ గ్రూప్ దశలో విజయం సాధించాలని భారత్ చూస్తోంది. అయితే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇబ్బంది పడ్డారు. అయితే రోహిత్‌కి ఈ మ్యాచ్‌లో కాస్త విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రోహిత్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇస్తే మాత్రం తప్పకుండా పంత్ జట్టులోకి వస్తాడు. అలాగే కాస్త పిక్క నొప్పితో ఉన్న షమికి కూడా విశ్రాంతి ఇవ్వచ్చనే తెలుస్తోంది. ఇతని స్థానంలో అర్ష్‌దీప్ ఆడతాడని తెలుస్తోంది. అయితే కుల్‌దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తి ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్
-
ICC Champions Trophy: ఇండియా విన్.. కానీ షమీ ఖాతాలో చెత్త రికార్డు