IND vs PAK: పాకిస్థాన్ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఇవే

IND vs PAK:
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీన భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 241 పరుగులకు ఆలౌటైంది. 242 పరుగులు లక్ష్యాన్ని టీమిండియా 42.3 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సెంచరీతో (100*) చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్(56) అర్ద శతకంతో అదర గొట్టాడు. రోహిత్(20), గిల్(46), హార్దిక్(8), అక్షర్(3*) పరుగులు చేశారు. టీమిండియా ఆరు వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో సౌద్ షకీల్ 62 పరుగులు, మహ్మద్ రిజ్వాన్ 46 పరుగుల చేశారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాకు ఒక్కోరు ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ పాకిస్థాన్ జట్టు ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
భారత్ బౌలర్లు ప్రారంభంలోనే వికెట్లు తీయడం
టాస్ గెలిచి పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లను టీమిండియా బౌలర్లు 9.2 ఓవర్లలోనే ఔట్ చేశారు. మ్యాచ్ ప్రారంభంలోనే ఇద్దరే బ్యాటర్లు ఔట్ కావడం మైనస్. బాబర్ అజమ్ కూడా ఔట్ అయ్యాడు. దీంతో పాక్ జట్టు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కాస్త తగ్గాయని చెప్పవచ్చు.
పరుగులు ఇవ్వని భారత్
మధ్య ఓవర్లో పాకిస్థాన్ జట్టుకి టీమిండియా అసలు పరుగులు ఇవ్వలేదు. రన్ రేటు చాలా తక్కువగా ఉండేది. పాక్ బ్యాటర్లు కూడా ఆచితూచి ఆడారు. కాస్త గట్టిగా కొట్టినా కూడా ఔట్ అవుతారు ఏమోనని భయంతో పెద్దగా పరుగులు చేయలేదు.
వరుస వికెట్లు
మొదటిలో పాకిస్థాన్ జట్టు బాగానే ఆడింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో 241 పరుగులతో పాకిస్థాన్ జట్టు ఆలౌట్ అయ్యింది. వరుస వికెట్లు పడటంతో పాక్ జట్టు ఓడిపోయింది.
పాకిస్తాన్ స్కోర్ : 241 (49.4 ఓవర్లు) పరుగులు (సౌద్ షకీల్ 62, మహ్మద్ రిజ్వాన్ 46, కుష్ దిల్ 38 పరుగులు – కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హర్దిక్ పాండ్యా 2 వికెట్లు)
భారత్ స్కోర్: 244-4 (42.3 ఓవర్లు) పరుగులు (విరాట్ కోహ్లీ 100*, శ్రేయాస్ అయ్యర్ 56, గిల్ 46, రోహిత్ శర్మ 20 పరుగులు – షాహీన్ అఫ్రిది 2 వికెట్లు)