IND vs PAK: పాక్ మొండిపట్టు.. చివరకు టోర్నీలో ఐదు రోజులే.. నెట్టింట ట్రోల్ చేస్తున్న మీమర్స్

IND vs PAK:
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌పై టీమిండియా జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. 2017 ఫైనల్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ను పాక్ ఓడించింది. దీనికి ప్రతీకారంగా టీమిండియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్‌ను మట్టికరిపించింది. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అంటే ఒక ఫీల్ అయితే.. దాయాది దేశంతో మ్యాచ్ అంటే ఎంతగానో ఎదురు చూస్తారు. అంచనాలకు మించి దాయాది దేశంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. పాక్ జట్టును భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో పాక్ సెమీస్ బెర్త్ ఇక ఖాయం కానట్లే. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టు ఇకపై ఇంటికి వెళ్లినట్లే. అయితే పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాలని ఆ దేశ జట్టు ఎంతగానో శ్రమించింది.
కొన్ని భద్రతా కారణాల వల్ల పాక్ వెళ్లలేదు. దీనికి బీసీసీఐ కూడా నో చెప్పడంతో పాక్ జట్టు తప్పకుండా తమ దేశం వచ్చి ఆడాలని తెలిపింది. ఈ నిర్ణయం కోసం ఎంతగానో శ్రమించింది. కొన్ని వారాల పాటు దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కుల కోసం ఎంతగానో పోరాడిన పాక్ ఇప్పుడు ఓడిపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. పాక్ జట్టును సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. పాకిస్థాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కుల కోసం దాదాపుగా రెండేళ్ల పాటు పోరాడింది. టోర్నీని పాకిస్థాన్‌లోనే నిర్వహించాలని మూడు నెలల పాటు మొండిపట్టు పట్టింది. ఆతిథ్య ఇవ్వాలని దాదాపుగా నాలుగు వారాల పాటు శ్రమించింది. కానీ టోర్నీలో మాత్రం కేవలం 5 రోజులు మాత్రమే ఉందని ట్రోల్ చేస్తున్నారు.
ఫిబ్రవరి 19వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైంది. ఫిబ్రవరి 23 వరకు మాత్రమే పాకిస్థాన్ టోర్నీలో ఉంది. గ్రూప్ ఏలో భాగంగా ఫస్ట్ పాకిస్థాన్ న్యూజిలాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఆ తర్వాత ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్ అయ్యినట్లే. అయితే టీమిండియా మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరిగింది. ఇందులో టీమిండియా గెలిచింది. గ్రూప్ ఏలో భాగంగా రెండు మ్యాచ్‌లు టీమిండియా గెలవడంతో.. పాకిస్థాన్ ఇక సెమీస్‌కు వెళ్లే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయినట్లే. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే తప్పకుండా పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇంటికి వెళ్తాయి. అదే బంగ్లాదేశ్ గెలిస్తే మాత్రం పాకిస్థాన్ సెమీస్‌కి వెళ్లే అవకాశాలు కాస్త ఉంటాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టును నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ను అబ్రార్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేసి.. ఈ తర్వాత చూస్తూ వెళ్లు.. వెళ్లు.. అన్నట్లుగా సైగ చేశాడు. ఇతనిని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇతనిపై జోకులు వేస్తున్నారు.
View this post on Instagram
Pakistan fought hard for a hybrid model, spent crores on stadiums, but played just one home game. Ironically, they were knocked out by a team that doesn’t even visit Pakistan.#INDvsPAK #ICCChampionsTrophy #CT2025 #Dubai #Cricket #TeamIndia #PakistanCricket pic.twitter.com/YdkCkVauBz
— Adnan Khan (@Khan249062Adnan) February 23, 2025
Pakistan is out of champions trophy 🤣#INDvsPAK #ViratKohli pic.twitter.com/27kMY1v0lk
— Prayag (@theprayagtiwari) February 23, 2025
-
ChatGPT: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. అన్ని ఫొటోలు ఈజీగా సేవ్ చేసుకోవచ్చు
-
Hero Nithin : గూబ పగులుద్ది..హీరో నితిన్ కి సోషల్ మీడియా స్ట్రాంగ్ వార్నింగ్!
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!