India-Bangladesh: భారత్- బంగ్లాదేశ్ వన్డే సిరీస్ షెడ్యూల్ రిలీజ్
ప్రస్తుతం దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నడుస్తోంది. క్రికెటర్లు అందరూ కూడా ఐపీఎల్‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ ఏడాది టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన కూడా ఉంది. ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లునున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

India-Bangladesh: ప్రస్తుతం దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నడుస్తోంది. క్రికెటర్లు అందరూ కూడా ఐపీఎల్‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ ఏడాది టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన కూడా ఉంది. ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లునున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లను ఆడుతుంది. అయితే ఆగస్టు 17న భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ సిరీస్ ప్రారంభం అవుతుంది. మొదట మూడు వన్డేల సిరీస్ జరిగి.. ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్ ఆడతారు. అయితే ఆగస్టు 17వ తేదీన మిర్పూర్‌లోని షేరే బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొదటి వన్డే మ్యా్చ్ జరుగుతుంది. ఆ తర్వాత ఆగస్టు 20వ తేదీన రెండో వన్డే కూడా జరుగుతుంది. ఇక మూడో వన్డే మ్యాచ్ ఆగస్టు 23వ తేదీన చట్టోగ్రామ్‌లో జరుగుతుంది. మూడు టీ20ల సిరీస్ ఆగస్టు 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 29న మిర్పూర్‌లో రెండో టీ20, ఆగస్టు 31న మూడో టీ20 జరుగుతాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉన్న ప్లేయర్లు అందరూ కూడా ఆయా దేశాలతో మూడు ఫార్మాట్ల క్రికెట్‌తో బిజీ అవుతారు. అయితే దీని తర్వాత ఇంగ్లాండ్ సిరీస్‌ల మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది అంతా కూడా టీమిండియా బిజీగా గడపనుంది. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతోంది. మే వరకు ఐపీఎల్ అయితే దీని తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది మొదటిలో ఛాంపియన్స్ ట్రోఫీ టీమిండియా ఆడింది. దీని తర్వాత ఐపీఎల్.. ఆ తర్వాత ఇంగ్లాండ్ టెస్టు సిరీస్, బంగ్లాదేశ్, వెస్టీండీస్‌తో ఈ ఏడాది అంతా కూడా ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది మొదట్లో కూడా ఇంగ్లాండ్‌తో టీమిండియా ఆడింది. పరిమిత ఓవర్ల సిరీస్ టీమిండియా ఆడింది. దీని తర్వాతే దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడింది. ఇప్పుడు ఐపీఎల్ ఆడుతోంది. ఇది ముగిసిన తర్వాత ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా మళ్లీ ఇంగ్లండ్
వెళ్లనుంది.
భారత్- ఇంగ్లాండ్ టెస్టు షెడ్యూల్
తొలి టెస్టు- జూన్ 20 నుంచి 24 వరకు
రెండో టెస్టు- జులై 02 నుంచి -06 వరకు
మూడో టెస్టు- జులై 10 నుంచి- 14 వరకు
నాలుగో టెస్టు- జులై 23 నుంచి- 27 వరకు
ఐదవ టెస్టు జులై 31 నుంచి – ఆగస్టు 04 వరకు
భారత్- బంగ్లాదేశ్ వన్డే షెడ్యూల్
తొలి వన్డే – ఆగస్టు 17 (మీర్పూర్)
రెండో వన్డే – ఆగస్టు 20 (మీర్పూర్)
మూడో వన్డే – ఆగస్టు 23 (చిట్టగాంగ్)
భారత్- బంగ్లాదేశ్ టీ20 షెడ్యూల్
తొలి టీ20 మ్యాచ్ – ఆగస్టు 26 (చిట్టగాంగ్)
రెండో టీ20 మ్యాచ్ – 29 ఆగస్టు (మీర్పూర్)
మూడో టీ20 మ్యాచ్ – ఆగస్టు 31 (మీర్పూర్)