Virat Kohli: ఆ కుర్రాడు మేలిమి బంగారం.. 17 సంవత్సరాల నిరీక్షణకు తెర దించుతాడు..
Virat Kohli టీమిండియాలో విరాట్ కోహ్లీకి స్టార్ ఆటగాడిగా పేరుంది. ఐపీఎల్ లోనూ బెంగళూరు జట్టులో వజ్రాయుధం లాంటి ఆటగాడిగా విరాట్ కోహ్లీని పిలుస్తుంటారు. అయితే అటువంటి విరాట్ కోహ్లీ ఒక ఆటగాడి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

Virat Kohli : విరాట్ కోహ్లీ ఒక ఆటగాడిని పొగడటం ఇటీవల కాలంలో జరగలేదు. అలాగని విరాట్ కోహ్లీకి గర్వం ఉంటుంది అనే మాటకు కూడా అర్థం లేదు. టాలెంట్ ను గుర్తించడంలో విరాట్ కోహ్లీ ముందుంటాడు. మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఆటగాడి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాలో విరాట్ కోహ్లీకి స్టార్ ఆటగాడిగా పేరుంది. ఐపీఎల్ లోనూ బెంగళూరు జట్టులో వజ్రాయుధం లాంటి ఆటగాడిగా విరాట్ కోహ్లీని పిలుస్తుంటారు. అయితే అటువంటి విరాట్ కోహ్లీ ఒక ఆటగాడి గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ యువ ఆటగాడిని ఆకాశానికి ఎత్తేస్తూ.. అతడిలో అద్భుతమైన ప్రతిభ ఉందని.. మోస్ట్ టాలెంటెడ్ బ్యాటర్ అని మెచ్చుకున్నాడు. విరాట్ కోహ్లీ అంత సులభంగా మరొక ఆటగాడిని మెచ్చుకోడు. ఒక ఆటగాడిలో విపరీతమైన ప్రతిభ.. అద్భుతమైన నైపుణ్యం.. అచంచలమైన క్రమశిక్షణ.. అనంతమైన పట్టుదల ఉంటేనే అతడు పాజిటివ్ గా వ్యాఖ్యలు చేస్తుంటాడు. అలాంటిది ఓ యువ ఆటగాడిని విరాట్ కోహ్లీ మెచ్చుకోవడం అంటే మాటలు కాదు. క్రికెట్ లో కింగ్ లా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ మెచ్చుకున్న ఆటగాడి పేరేంటంటే..
ప్రశంసలతో ముంచెత్తాడు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్ నియమితుడయ్యాడు. బెంగళూరులో సోమవారం అన్ బాక్స్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. మీడియా ప్రతినిధులతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. కొత్త సీజన్లో జట్టుకూర్పు బాగుందని.. పేర్కొన్నాడు. ” జట్టు మేనేజ్మెంట్ నియమించిన కొత్త కెప్టెన్ బాగున్నాడు. అతడు సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. బెంగళూరు జట్టును నాయకుడిగా ముందుకు నడిపిస్తాడు. అతనిపై మీ ప్రేమను కురిపించండి. అతడికి మీ ఆదరభిమానాలు అందించండి. రజత్ కు మీ సపోర్ట్ అవసరం. అతడు అద్భుతమైన ఆటగాడు.. అతడి భుజాలపై విపరీతమైన బాధ్యతలు ఉన్నాయి. బెంగళూరు జట్టును ముందుండి నడిపించడమే అతడికి ఉన్న ప్రధాన కర్తవ్యం.. ఈ ఫ్రాంచైజీ మీద అభిమానులు పెట్టుకున్న నమ్మకాలని అతడు నెరవేరుస్తాడు. జటను గెలుపు బాటలు నడిపిస్తాడు. సారధిగా అతడు అభివృద్ధి చెందడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అతడిలో ప్రతిభ మెండుగా ఉందని” విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ సీజన్ లో బెంగళూరు జట్టు మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీ కెప్టెన్ చేస్తానని సంకేతాలు ఇచ్చింది. అయితే అనూహ్యంగా రజత్ వైపు మొగ్గు చూపించింది. రజత్ కూడా మెరుగైన ఆటగాడు.. చివరి ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. పరుగులు కూడా వేగంగా తీస్తాడు. ముఖ్యంగా ఎదురుదాడికి దిగడంలో అతడి తర్వాత ఎవరైనా. అందువల్లే అతడిని కెప్టెన్ గా బెంగళూరు జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ సీజన్లో అతడు అద్భుతంగా ఆడతాడని.. జట్టును ముందుండి నడిపిస్తాడని.. ట్రోఫీ అందిస్తాడని బెంగళూరు జట్టు యాజమాన్యం భావిస్తోంది.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?