NZ vs SA: నేడే సెమీ ఫైనల్ 2 మ్యాచ్.. ఫైనల్లో భారత్‌తో తలపడే ఆ జట్టు ఏది?

NZ vs SA:
ఫిబ్రవరి 19న ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో మొదటి సెమీ ఫైనల్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడగా.. టీమిండియా ఘన విజయం సాధించింది. నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు రెండో సెమీ ఫైనల్లో తలపడనున్నాయి. పాకిస్థాన్‌లోని లాహోర్ వేదికగా సెమీ ఫైనల్ 2 జరగనుంది. దక్షిణాఫ్రికా ఈ టోర్నీలో రెండు మ్యాచ్‌లు గెలవగా, ఒకటి వర్షం కారణంగా ఆగిపోయింది. అయితే న్యూజిలాండ్ జట్టు వరుస మ్యాచ్‌లు గెలుస్తూ వచ్చింది. కానీ చివరకు భారత్ చేతిలో ఓడిపోయింది. ఈ రెండు జట్లు రెండో సెమీ ఫైనల్లో తలపడనున్నాయి. అయితే మొదటి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి.. ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో గెలిచిన జట్టు ఫైనల్లో టీమిండియాతో తలపడనున్నాయి. ఫైనల్లో భారత్‌తో తలపడే ఆ జట్టు ఏదని ఇండియా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
సెమీస్‌లో దక్షిణాఫ్రికా తుది జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ర్యాన్ రెకెల్టన్, రాసీ వాన్‌డర్ డుసెన్, ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగీ ఎంగ్డీ
న్యూజిలాండ్ తుదిజట్టు (అంచనా): విల్ యంగ్, రచిన్ రవీంద్ర లేదా డెవోన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, కైల్ జెమీసన్, విల్ ఓరౌర్కే
ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్లో ఆసీస్‌ను భారత్ చిత్తుగా ఓడించి ఫైనల్‌కి చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 264 పరుగుల వద్ద ఆలౌటైంది. 265 పరుగులతో బరిలోకి దిగిన భారత్ జట్టు 48.1 ఓవర్లలో 265 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సిక్సర్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. ఇండియా గెలవడంలో విరాట్ కోహ్లీ ముఖ్య పాత్ర పోషించాడు. ఐదోసారి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి చేరింది. అయితే 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ కంగారుల చేతిలో ఓడిపోయింది. దీనికి ప్రతీకారంగా భారత్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియను చిత్తుగా ఓడించింది. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ పడతాదని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ కోహ్లీ ఔట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 45 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 34, హర్దిక్ పాండ్య 28, రోహిత్ శర్మ 28, అక్షర్ పటేల్ 27, శుభమన్ గిల్ 8 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు ఆడమ్ జంపా 2 వికెట్లు తీశాడు. బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లి్ష్, కూపర్ కనోలీ ఒక్కో వికెట్ తీశారు.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్
-
ICC Champions Trophy: ఇండియా విన్.. కానీ షమీ ఖాతాలో చెత్త రికార్డు