Pakistan: పాక్ జట్టుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం.. ఒక్క మ్యాచ్ గెలవకపోవడమే దీనికి కారణమా?

Pakistan:
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వగా.. హైబ్రిడ్ మోడల్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి మరి పాకిస్థాన్ దేశంలోని స్టేడియం లను బాగు చేశారు. వీటి కోసం పాకిస్థాన్ బాగా ఖర్చు చేసింది. కానీ మ్యాచ్ పరంగా మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేయలేకపోయింది. మొదటి మ్యాచ్ నుంచి ఓటమి చవి చూసింది. దీంతో పాక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్, భారత్‌తో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ జట్టు ఆఖరి స్థానంలో ఉంది. దీంతో ప్లేయర్స్, పీసీబీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా పాక్ జట్టుపై మండిపడుతున్నారు. రిజ్వాన్ ఆటతీరుపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్తామని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. పాకిస్థాన్ జట్టు ఆడిన తీరుపై తప్పకుండా పార్లమెంట్‌లో చర్చించాలని ప్రధాని షెహబాబ్‌ను కోరుతామని అంటున్నారు. అయితే పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు చేరకుండా ఓడిపోవడంతో ప్రధాని కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఆడిన తీరుపై సనావుల్లా స్పందించాడు. పాక్ క్రికెట్ జట్టు ఆట తీరు చాలా దారుణంగా ఉందని, ఈ జట్టు విషయం పార్లమెంటులో ప్రస్తావించాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. పాక్ క్రికెట్ బోర్డు ఒక స్వతంత్ర సంస్థ. తమ దగ్గర ఉన్న డబ్బులు ఎలా ఖర్చుపెడుతుందో.. తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని తెలిపింది. పీసీబీలోని కొందరు అధికారులు వారికి నచ్చినట్లు నగదును ఖర్చు చేస్తున్నారని, బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలం అవుతున్నారని అన్నారు. ఆటగాలకు ఇచ్చే ఈ ప్రోత్సాహకాలు భారీగా ఉన్నాయని, ఇవి జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. అయితే పాక్ జట్టు ప్రద్శనపై పార్లమెంట్‌లో తప్పకుండా చర్చ జరిగే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ కథ ముగియడంతో పార్లమెంట్‌లో చర్చించుకోనున్నారు. టోర్నీ నుంచి నిష్క్రమించడం, జట్టు పేలవమైన ప్రదర్శన చేయడంతో ఆ దేశ ఫ్యా్న్స్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్
-
ICC Champions Trophy: ఇండియా విన్.. కానీ షమీ ఖాతాలో చెత్త రికార్డు