Rishabh Pant: మొదటి మ్యాచ్‌లోనే పంత్ డకౌట్.. రూ.27 కోట్లు బొక్కా!
Rishabh Pant వైజాగ్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఢిల్లీ జట్టు ఒక వికెట్ తేడాతో గెలిచింది. లక్నో జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగుల స్కోరు చేసింది.

Rishabh Pant: ఐపీఎల్ 18వ సీజన్ జరగుతోంది. ఈ క్రమంలో వైజాగ్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. గతంలో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ మెగా వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడు కూడా పంత్. మొత్తం అన్ని ఐపీఎల్ సీజన్లో చూసుకుంటే ఇంత ధరకు ఏ ఆటగాడు కూడా పలకలేదు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ.27 కోట్లకు పంత్‌ను కొనుగోలు చేసింది. అయితే ఈ ఐపీఎల్లో లక్నో తరఫున్ పంత్కి ఇది మొదటి మ్యాచ్. వైజాన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంత్ ఒక్క రన్ కూడా తీయకుండా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వెళ్లిన వెంటనే డకౌట్ అయ్యాడు. 6 బంతుల్లో కనీసం ఒక్క రన్ కూడా తీయలేదు. ఎంతో ఆశలో లక్నో పంత్‌ను భారీ ధరకు కొనుగోలు చేసి కెప్టెన్‌ను చేసింది. కానీ పంత్ డకౌట్ అయిపోవడంతో లక్నో ఫ్రాంచైజీతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా నిరుత్సాహ పడ్డారు. పలువురు సోషల్ మీడియాలో రూ.27 కోట్లు బొక్క అని కామెంట్లు చేస్తున్నారు. అన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే నమ్మకంతో కనీసం ఒక్క రన్ కూడా చేయలేదని అంటున్నారు. మొదటి మ్యాచ్‌తోనే ఫ్యాన్స్ అందరూ బాగా నిరాశ చెందారు. సోషల్ మీడియాలో పంత్‌పై బాగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేసినందుకు కనీసం ఒక్క రన్ కూడా తీయలేకపోయారని నెటిజన్లు అంటున్నారు.
వైజాగ్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఢిల్లీ జట్టు ఒక వికెట్ తేడాతో గెలిచింది. లక్నో జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగుల స్కోరు చేసింది. పంత్ డకౌట్ కాగా.. నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ 210 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఎంతో ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు ఒక వికెట్ తేడాతో గెలిచింది. నిజానికి లక్నో జట్టు గెలవాల్సిన మ్యాచ్ ఇది. కానీ పంత్ ఒక్క రన్ తీయకపోవడం, ఆ తర్వాత మళ్లీ వికెట్ కీపర్‌గా కూడా సరిగ్గా వ్యవహరించకపోవడంతో పంత్‌పై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. దగ్గర ఉండి మరి ఢిల్లీ జట్టును పంత్ గెలిపించాడని పలువురు అంటున్నారు. పంత్ చేసిన తప్పు వల్లే లక్నో జట్టు ఓడిపోయిందని అంటున్నారు. పంత్ లాస్ట్‌లో మిస్ చేయకుండా ఉండే తప్పకుండా లక్నో జట్టు మ్యాచ్ గెలిచేదని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. పంత్ వల్లే లక్నో జట్టు ఓడిపోయిందని అంటున్నారు.