Rohit Sharma: 12 సార్లు టాస్ ఓడి.. లారా రికార్డును ఈక్వెల్ చేసిన హిట్ మ్యాన్

Rohit Sharma:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ రికార్డును సృష్టించాడు. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో న్యూజిలాండ్ జట్టు టాస్ విన్ అయ్యింది. కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయి రికార్డు సమం చేశాడు. వన్డే క్రికెట్‌లో వరుసగా 12వ సారి టాస్‌ను ఓడిపోయాడు. గతంలో ఈ రికార్డు విండిస్ దిగ్గజం బ్రయన్ లారా పేరు మీద ఉంది. 1998-99 సీజన్‌లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు. ఇప్పుడు ఆ రికార్డును రోహిత్ కోహ్లీ సమయం చేశాడు. అయితే 2023 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా.. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నుంచి టీమిండియా వరుసగా టాస్ ఓడిపోతుంది. భారత్ ఇలా టాస్ ఓడిపోవడం అప్పటి నుంచి ఆనవాయితీగా అయిపోయింది. అయితే ఇలా వన్డేల్లో టాస్ ఓడిపోయిన వారిలో లారా, రోహిత్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా నెదర్లాండ్స్‌కు చెందిన పీటర్ బారెన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇతను మొత్తం 11 సార్లు టాస్ ఓడిపోయాడు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో కివీస్ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. ఈ సమయంలో భారత్ బౌలర్లు బాగా ఆడారు. ఓవర్ ఇచ్చిన వెంటనే వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశాడు. న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్‌ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. దీంతో 57 పరుగుల వద్దే న్యూజిలాండ్ ఒక వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ క్రీజుకి వచ్చాడు. ఇంతలో కుల్‌దీప్ యాదవ్ మరో వికెట్ తీశాడు. 10.1 పరుగుల వద్ద రచిన్ రవీంద్రను కుల్‌దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత డారిల్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు. ఇంతలో కుల్ దీప్ యాదవ్ మరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కేన్ విలియమ్సన్‌ను కుల్‌దీప్ యాదవ్ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత టామ్ లేథమ్ జడేజా బంతికి ఔట్ అయ్యాడు. వరుసగా నాలుగు వికెట్లు పడటంతో మ్యాచ్ గెలుపు టీమిండియా వైపు మళ్లింది. 31.4 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోర్ 143/4గా ఉంది.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
న్యూజిలాండ్ జట్టు
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్ ఆడుతున్నారు.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!