Rohit Sharma: హిట్ మ్యాన్ సరికొత్త రికార్డు.. సెకండ్ ఫాస్టెస్ట్ క్రికెటర్‌గా.. రోహిత్ రికార్డు

Rohit Sharma: భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 41 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌తో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ వన్డేల్లో మొత్తం 11 వేల పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ప్రపంచ వన్డే క్రికెట్‌లో సెకండ్ ఫాస్టెస్ట్ క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మకి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 261వ వన్డే ఇన్నింగ్స్. 261 ఇన్నింగ్స్‌లో మొత్తం 11 వేల పరుగులు చేసి తనదైన ముద్ర వేశాడు. అయితే ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో కింగ్ విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లీ మొత్తం 222 వన్డే ఇన్నింగ్స్‌లో 11 వేల పరుగులు చేయగా.. సచిన్ 276 వన్డే ఇన్నింగ్స్‌లో చేసి మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ సచిన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి వెళ్లాడు. అయితే ప్రపంచ క్రికెట్‌లో వన్డేల్లో 11 వేల పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ పదో స్థానంలో ఉన్నాడు. అయితే వన్డేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సచిన్ 18426 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.
రోహిత్ శర్మ ఫామ్‌లో లేడని, రిటైర్ కావాలని చాలా మంది అన్నారు. కానీ ఇటీవల ఇంగ్లండ్‌పై సెంచరీ చేసి మళ్లీ రోహిత్ ఫామ్ అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అర్థ శతకం వరకు వెళ్లి ఔట్ అయ్యాడు. అయితే గతేడాది రోహిత్ అధ్వర్యంలోనే భారత్ టీ20 ప్రపంచ కప్‌ను సాధించింది. ఈసారి మళ్లీ రోహిత్ అధ్వర్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా సాధించాలని క్రికెట్ ప్రేమికులు ఎంతగానో కోరుకుంటున్నారు. టీమిండియా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే భారత్ సెమీస్‌కు వెళ్లడం ఖాయం. పాక్ తర్వాత న్యూజిలాండ్‌తో టీమిండియా మ్యాచ్ ఆడనుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్, పాకిస్థాన్ వేదికగా జరుగుతోంది. దుబాయ్‌లో హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతోంది. కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్థాన్‌కి వెళ్లడం లేదు. దీంతో హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగే మ్యాచ్‌లన్ని కూడా జరుగుతాయి.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్