IPL 2025 : ఐపీఎల్‌లో అంపైర్‌గా అండర్ 19 కప్ హీరో

IPL 2025 :
మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లు ఆడనున్నాయి. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. అయితే ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ 18వ సీజన్ మొత్తం 11 వేదికల్లో జరగనుంది.
ఫైనల్ మ్యాచ్ మే 25న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్‌లలో అంపైర్‌గా విరాట్ కోహ్లీ సహచరుడు బాధ్యతలు స్వీకరించనున్నాడు. తన్మయ్ శ్రీ వాస్తవ 2008లో అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించాడు. ఆ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించి ఆ తర్వాత ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన్మయ్ కింగ్స్ లెవన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్), డెక్కన్ ఛార్జర్స్, కోచీ టస్కర్స్ కేరళ తరపున ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత మెగా టోర్నీ భారీగా విఫలం కావడంతో మళ్లీ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వలేదు.
తన్మయ్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ తరఫున 90 మ్యాచ్‌లు ఆడి.. అందులో 4900కి పైగా పరుగులు సాధించాడు. అయితే ఈ సీజన్ ఐపీఎల్‌లో తన్మయ్ అంపైర్‌గా ఉండనున్నాడు. ఈ విషయాన్న యూపీ క్రికెట్ సంఘం అధికారికంగా తెలిపింది. తన్మయ్ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్‌లో 46 పరుగులతో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 159 పరుగులకే ఆలౌటైంది. భారత్ విజయం సాధించింది. అయితే ఈ టోర్నీలో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. దీని నుంచి అతనికి మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ స్టార్ క్రికెటర్ల జాబితాలో ఉన్నాడు. ఎన్నో రికార్డులు సాధిస్తున్నాడు. అయితే ఐపీఎల్‌లో కోహ్లీ రాయల్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు నుంచి ఆడుతున్నాడు. ఈ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ గెలవలేదు.
-
MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్‌లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?