IPL 2025: ఐపీఎల్‌లో ఖరీదైన టాప్ ప్లేయర్లు వీరే

IPL 2025:
మార్చి 22వ తేదీన ఐపీఎల 18వ సీజన్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభానికి క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య జరగనుంది. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. మొత్తం 65 రోజుల పాటు ఈ ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీలు మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేశారు. మరి ఐపీఎల్ సీజన్‌లో ఎక్కువ ధరకు పలికిన ఆటగాళ్లు ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
రిషబ్ పంత్
ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా ఉన్న రిషబ్ పంత్‌ను ఈ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ.7 కోట్ల రూపాయలు పెట్టి సొంతం చేసుకుంది. ఇతని బ్యాటింగ్ తీరు, వికెట్ కీపింగ్ ఉండటంతో ఇతని ఎక్కువ ధరకు తీసుకుంది.
శ్రేయాస్ అయ్యర్
పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయాస్ అయ్యార్‌ను రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. రిషబ్ పంత్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచాడు. అయితే ఇంతకు ముందు శ్రేయాస్ అయ్యార్ కేకేఆర్ జట్టులో ఉండేవాడు. ఈ మెగా వేలంలో పంజాయ్ కింగ్స్ భారీ ధరకు ఇతన్ని సొంతం చేసుకుంది. ఇతను తప్పకుండా కప్ కొట్టే బాటలో నడిపిస్తాడనే ఉద్దేశంతో పంజాబ్ కింగ్స్ ఇతన్ని భారీ ధరకు కొనుగోలు చేసింది.
వెంకటేష్ అయ్యర్
ఆల్ రౌండర్ అయిన వెంకటేష్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇతను బ్యాటింగ్, బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంటాయి. కేకేఆర్ తరఫున వెంకటేష్ సూపర్ ఇన్నింగ్స్ లతో ఆడాడు.
హెన్రిచ్ క్లాసెన్
దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ హెన్రిచ్ క్లాసెన్‌కు కూడా ఐపీఎల్‌లో మంచి డిమాండ్ ఉంది. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.23 కోట్ల రూపాయలకు హెన్రిచ్‌ను రిటైన్ చేసుకుంది. బ్యాటింగ్ మొదలు పెడితే ఇక బాదుడే బాదుడు.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి ఆడుతున్నాడు. ఇతన్ని ఫ్రాంచైజీ రూ. 21 కోట్ల రూపాయలతో రిటైన్ చేసుకుంది. కోహ్లీకి భారీ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు కూడా ఉంది.
-
MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్‌లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే
-
Tilak Varma: తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్.. తెలుగు కుర్రాడికి ఘోర అవమానం
-
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను గుడ్ న్యూస్.. బుమ్రా ఎంట్రీ అప్పుడే?