Google Pay: గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్.. చదువు లేకపోయినా ఈజీ పేమెంట్స్
Google Pay: ప్రస్తుతం అందరూ కూడా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి ఒక వస్తువు కొనాలనుకున్నా కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నారు.

Google Pay: ప్రస్తుతం అందరూ కూడా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి ఒక వస్తువు కొనాలనుకున్నా కూడా ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ పే, గూగుల్ పే వంటివి చేస్తుంటారు. అసలు నెట్ క్యాష్ వాడటమే మానేశారు. ప్రతీ ఒక్కరూ కూడా ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే వీటి వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది. ఎందుకంటే చదువు వచ్చిన వాళ్లు వీటిని వాడుతున్నారు. కానీ చదువు రాని వాళ్లు వీటిని ఉపయోగించినా.. తెలియని వాళ్లకు డబ్బులు పంపిస్తున్నారు. దీనివల్ల అకౌంట్లోని డబ్బులు అయిపోతున్నాయి. అయితే యూపీఐ పేమెంట్స్ చేసే వారికి కూడా కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ క్రమంలో మరో కొత్త ఫీచర్‌ను యూపీఐ గూగుల్ పే వినియోగదారులకు తీసుకొస్తోంది. ఎందుకంటే యూపీఐని చాలా మంది చదువుకోని వారు వాడలేకపోతున్నారు.
ఇలాంటి వారి అందరికి ఉపయోగపడే విధంగా గూగుల్ పే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌తో చదువు రాని వారు కూడా ఈజీగా పేమెంట్స్ చేయవచ్చు. మరి కొద్ది రోజుల్లో ఏఐ(AI) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా ఈజీగా పేమెంట్స్ చేయవచ్చు. వాయిస్ కమాండ్స్‌తో ఎలాంటి ఇబ్బంది లేకుండా పేమెంట్స్ చేయవచ్చు. అయితే ఇందులో అన్ని రకాల భారతీయ భాషలను కూడా తీసుకొచ్చే విధంగా గూగుల్ ప్రయత్నిస్తోంది. ఈ ఫీచర్ త్వరలో రాబోతుంది. ఇది కనుక వచ్చినట్లయితే.. ఇక చదువు రాని వారు కూడా ఈజీగా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.
టెక్నాలజీ మారిన తర్వాత అందరూ కూడా యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. షాపుకు వెళ్లి ఒక రూపాయి వస్తువు కొనాలనుకున్నా కూడా ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. నెట్ క్యాష్ వాడటం చాలా తక్కువ. ఇలాంటి కారణాల వల్ల గూగుల్ పే ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఫీచర్ కనుక వస్తే తప్పకుండా బాగా ఉపయోగపడుతుంది. చదువు రాని వారు తెలియకుండా ఇతరులకు డబ్బులు పంపించే అవకాశం ఉండదు. దీనివల్ల కొంత స్కామ్ తగ్గుతుంది. ఈ రోజుల్లో చాలా మంది తెలియక వాడుతుండటం వల్ల కొందరికి డబ్బులు వెళ్లిపోతున్నాయి. వాళ్లకి తెలియక మళ్లీ అవి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అదే ఈ కొత్త ఫీచర్ అనుకో.. వాయిస్ తో డబ్బులు పంపిస్తారు. అది కూడా తెలిసిన వాళ్లకు మాత్రమే అవుతుంది.