Iphone 17: ఐఫోన్ 17 సిరీస్ లీక్ అయిన డిజైన్ చూశారా.. సూపర్ ఉన్నాయ్

Iphone 17: ఐఫోన్ ప్రతీ ఏడాది కొత్త సిరీస్‌ను లాంఛ్ చేస్తుంది. ఇప్పటి వరకు 16 సిరీస్‌లు వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 17 సిరీస్‌ను లాంఛ్ చేయనుంది. ఐఫోన్ కొత్త సిరీస్, వాటి ఫీచర్ల కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. కొందరు అయితే ప్రతీ ఏడాది వచ్చే కొత్త సిరీస్‌ను కొంటుంటారు. ఒక్కసారి ఐఫోన్ వాడిన తర్వాత మళ్లీ వేరే మొబైల్ వాడటానికి పెద్దగా ఇష్టపెట్టుకోరు. ఈ క్రమంలో కొత్త సిరీస్‌ను కొంటుంటారు. చాలా కొత్త డిజైన్‌తో ఐఫోన్ ప్రియులను ఆకర్షించే విధంగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఐఫోన్ 17 సిరీస్‌లో ప్రో మ్యాక్స్ డిజైన్, ఫీచర్లు అన్ని కూడా లీక్ అయ్యాయి. మరి ఆ ఫీచర్లు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
డిజైన్
ఐఫోన్ డిజైన్‌లో పెద్ద మార్పులు రావు. ఎప్పుడూ కూడా ఒకే మోడల్ వస్తుంది. కానీ ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిజైన్‌ను పూర్తిగా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇంకా సన్నగా, తేలికగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రీన్ చుట్టూ ఉండే అంచులు మరింత సన్నగా మారవచ్చని అంటున్నారు.
మెరుగైన డిస్‌ప్లే టెక్నాలజీ
ఐఫోన్ డిస్ ప్లే సూపర్‌గా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆపిల్ నాసిరకం ఉపయోగించదు. అయితే ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో ఆపిల్ మరింత అధునాతన డిస్‌ప్లే టెక్నాలజీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో మరింత మెరిసే రంగులు కూడా ఉన్నాయి. వీటి వల్ల గేమ్స్ వంటివి ఆడటానికి ఇంకా క్లారిటీ బాగుంటుంని తెలుస్తోంది.
అత్యాధునిక కెమెరా సిస్టమ్
ఆపిల్ కెమెరాలు మంచి క్వాలిటీ ఉంటుంది. ఫొటోల కోసం చాలా మంది ఐఫోన్ వాడుతుంటారు. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో కెమెరా సిస్టమ్‌లో కూడా అప్‌గ్రేడ్‌లు ఉంటాయని అంటున్నారు. పెద్ద సెన్సార్‌లు, మెరుగైన ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలు, తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫోటోలు వచ్చేలా ఆపిల్ భావిస్తోంది. అలాగే వీడియో రికార్డింగ్‌లో కూడా కొత్త ఫీచర్లు రావచ్చని తెలుస్తోంది.
శక్తివంతమైన ప్రాసెసర్
ప్రతి కొత్త ఐఫోన్ మోడల్‌లో ఆపిల్ తన స్వంత చిప్‌సెట్‌ను అప్‌గ్రేడ్ చేస్తుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో తదుపరి తరం A-సిరీస్ చిప్ ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రాసెసర్ వల్ల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే గ్రాఫిక్స్ సామర్థ్యం మెరుగుపడటంతో పాటు బ్యాటరీ జీవితం కూడా బాగుంటుందని అంటున్నారు.
బ్యాటరీ
ఐఫోన్ వినియోగదారులు బ్యాటరీ విషయంలో కాస్త చిరాకు పడతారు. సాధారణంగా బ్యాటరీ ఐఫోన్‌కు ఎక్కువగా ఉండదు. అయితే ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో ఆపిల్ బ్యాటరీ కాస్త ఎక్కువగా ఉండేలా ఆపిల్ ప్లాన్ చేస్తోంది.
-
Whatsapp New Feature: వాట్సాప్‌లోకి వచ్చేసిన కొత్త ఫీచర్.. యూజర్ల ప్రైవసీకి అసలు భయపడక్కర్లేదు
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Zodiac Signs: త్వరలో జరగనున్న మహా అద్భుతం.. ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Home loan refinancing: గృహ రుణ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలేంటి?
-
Zodiac Signs: ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ మాయం.. ఈ రాశుల వారి పంట పండినట్లే