Sleep Health: అలారం పెట్టుకొని నిద్ర లేస్తున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే..

Sleep Health:
బిజీ లైఫ్ కు అలవాటు పడిపోయారు చాలా మంది. రాత్రి లేట్ నైట్ పడుకుంటారు. ఆఫీస్, కాలేజ్, స్కూల్ అని పొద్దున్నే లేవాలి. ఇక షిఫ్టులు ఉన్నవారు 4, 5 గంటలకే నిద్ర లేవాల్సి వస్తుంటుంది. మరి ఆ సమయానికి నిద్ర లేవడం కష్టమే కదా. సో అందుబాటులో ఉన్న పరికరం అలారం. ఫోన్ లో అలారం పెట్టుకొని హాయిగా నిద్ర లేస్తుంటారు. కానీ ఈ అలారం మీకు ఎంత ప్రమాదం కలిగిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. ఈ అలారం వల్ల చాలా నష్టాలు ఉన్నాయట. ఏకంగా ప్రాణానికి కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఓ సారి ఈ అలారం పెట్టుకొని నిద్ర లేస్తే జరిగే నష్టాల గురించి తెలుసుకుందాం.
అయితే గ్రామీణ ప్రజలు ఇలాంటి పరికరాల మీద చాలా తక్కువ ఆధారపడతారు. కానీ పట్టణ వాసులు మాత్రం ఈ పరికరాల మీద ఎక్కువ ఆధారపడతారు. అందుకే గ్రామీణ వాసులకంటే పట్టణ వాసులు ఎక్కువ సమస్యలకు గురవుతుంటారు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ అలారం విషయంలో కూడా సేమ్. వారు కోడి కూయడంతో లేస్తే వీరు రాత్రి పెట్టుకున్న అలారంతో లేస్తుంటారు. అయితే ఈ అలారం మిమ్మల్ని నిద్ర లేపడంలో సహాయం చేస్తుంది కావచ్చు కానీ ఉదయమే మీ రక్తపోటును కూడా పెంచుతుంది.
ఇదే కంటిన్యూగా జరుగుతుంటే బీపీ పేషెంట్ గా మారే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాదు గుండె జబ్బుల ప్రమాదం కూడా వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. అలారం లేకుండా మేల్కునే వారితో పోలిస్తే అలారంతో నిద్ర లేచే వారి రక్తపోటు 74 శాతం పెరుగుతుందట. అంతేకాదు ఏడు గంటల కన్నా తక్కువ నిద్ర పోయే వారికి కూడా బీపీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందట. ఇదే కంటిన్యూ అయితే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉంటే వారిని ఈ సమస్య మరింత బాధ పెడుతుంది.
గాఢ నిద్ర నుంచి మేల్కొలిపే ఈ అలారం కొన్ని గంటల పాటు మీ అలసటకు, ఒత్తిడికి కారణం అవుతుంది. ఇకనైనా అలారాలను ఎక్కువగా ఉపయోగించడం మానేయండి. డైలీ ఒకే సమయానికి నిద్ర లేస్తే కచ్చితంగా మీరు అదే సమయానికి రోజు నిద్ర లేస్తుంటారు. అలారం వల్ల మీ మైండ్ ఒక సమయానికి అలవాటు పడి ఉంటుంది. సో ఇక నుంచి అలారంను స్కిప్ చేసి పడుకోండి. మీరే నిద్ర లేస్తారు. సూర్యరశ్మ పడే గదిలో మీరే త్వరగా నిద్ర లేస్తారు. సో మీ గదిలో సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి.
ఒకే సమయానికి పడుకుంటే ఒకే సమయానికి నిద్ర లేస్తారు కూడా. సో మీరు పడుకునే సమయం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలారం పెట్టుకునే పరిస్థితిలో ఉంటే మాత్రం వినడానికి హాయిగా ఉండే మీ మైండ్ ను రిలాక్స్ ఉంచే మ్యూజిక్ ను సెట్ చేసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
Vastu Tips: దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Sleep: పడుకున్న వెంటనే నిద్ర పట్టాలా? ఇవి పాటించండి..
-
Sleep Health: ఆలస్యంగా నిద్రపోతే.. ఎంత ప్రమాదమో మీకు తెలుసా?
-
Sleep: పగటి పూట నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా? ఎంత టైమ్ నిద్రపోవాలి
-
Sleep: బెడ్ ఎక్కిన వెంటనే నిద్ర పోవాలి అంటే ఇలా చేయండి..
-
Sleep: పడుకునేటప్పుడు బ్రా వేసుకుని పడుకుంటున్నారా? వామ్మో ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?