Viral Video: ఆనందంగా ప్రీ వెడ్డింగ్.. అంతలోనే ఉపద్రవం.. వధూవరుల పరిస్థితిదీ
Viral Video: భారతదేశంలో పెళ్లిళ్లకు మంచి గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే.. ఇటీవలి కాలంలో పెళ్లిళ్లలోనూ వింత పోకడలు, విపరీత ధోరణులు విమర్శలకు కారణమవుతున్నాయి.
భారత దేశంలో ఒకప్పుడు పెళ్లి అంటే 16 రోజుల వేడుక. తర్వాత అది 5 రోజులకు కుదించారు. ఇప్పుడు 5 గంటల్లో ముగిస్తున్నారు. అయితే పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకునే వేడుక కావడంతో నేటితరం దీనికి ఆధునికతను జోడిస్తోంది. ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్(Pre Wedding Shoots)లు కామన్‌గా మారాయి. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రీ వెడ్డింగ్, హల్దీ, బ్యాచిలర్ పార్టీ వంటివి ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే తాజాగా ప్రీ వెడ్డింగ్ వేడుక ప్రమాదానికి కారణమైంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్లో కలర్ బాంబ్(Colour Bomb) (రంగు వెడి) పనిచేయకపోవడంతో మంటలు చెలరేగి పెళ్లి కూతురుకు గాయాలయ్యాయి. ఈ ఘటన మార్చి 20న వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగింది?
ఈ సంఘటనలో కెనడా నుంచి వచ్చిన ఒక భారతీయ సంతతి జంట, విక్కీ(Vikey) మరియు పియా(Piya), బెంగళూరు(Bangaloor)లో తమ వివాహ వేడుకల కోసం ఫోటో షూట్ చేస్తున్నారు. వారు ఒక అద్భుతమైన ఫోటో కోసం బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్ బాంబ్లను ఉపయోగించాలని ప్లాన్ చేశారు. అయితే, ఈ కలర్ బాంబ్ సరిగా పనిచేయక (మిస్‌ఫైర్), ఊహించని విధంగా జంట వైపు దూసుకెళ్లి, మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పియా గాయపడింది, ఆమె వీపున బర్న్ మార్కులు మరియు జుట్టు కాలిన గుర్తులు కనిపించాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
జంట స్పందన..
విక్కీ, పియా ఈ ఘటన గురించి ఇన్‌స్ట్రాగామ్‌లో వీడియో షేర్ చేస్తూ, ‘మేము ఒక ఎపిక్ షాట్ కోసం కలర్ బాంబ్లను ఉపయోగించాలనుకున్నాం, కానీ అది మిస్‌ఫైర్ అయి మా వైపు దాడి చేసింది‘ అని రాశారు. వారు వివాహాల్లో ఇలాంటి ప్రమాదకరమైన వస్తువుల వాడకంపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో వైరల్..
ప్రమాద ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది, చాలా మంది ఈ వీడియోను చూసి షాక్ అయ్యారు. వివాహ ఫోటో షూట్లలో రంగు వెడి లాంటి వాటిని ఉపయోగించేటప్పుడు సురక్షితంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.
View this post on Instagram