Groom Viral Video: మైఖెల్ జాక్సన్ తమ్ముడిలా ఉన్నాడు.. వధువు ముందు డ్యాన్స్ ఇరగదీసిన వరుడు
Groom Viral Video: వైరల్ అవుతున్న ఈ వీడియోలో వరుడు అదిరిపోయే, ఎనర్జిటిక్ డ్యాన్స్ చేశాడు. పాట కూడా మామూలుగా లేదు, సూపర్ హిట్ సినిమా 'కరణ్ అర్జున్'లోని పవర్ఫుల్ డైలాగ్ 'ఠాకూర్ తో గయో' రీమిక్స్ వెర్షన్‌కు అతను స్టెప్పులు వేశాడు.

Groom Viral Video: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెళ్లికూతురు, పెళ్లికొడుకులకు సంబంధించిన వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతూ, తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఇప్పుడు తాజాగా బయటపడిన ఒక వీడియో మాత్రం వాటన్నింటినీ మించిపోయింది. ఈ వీడియోలో ఒక వరుడు తన అద్భుతమైన డ్యాన్స్‌తో ఏకంగా మైఖేల్ జాక్సన్‌కే పోటీ ఇస్తున్నట్లు కనిపించాడు. అంటే, అతను వేసిన స్టెప్పులు చూసి మీరు నోరెళ్ళబెట్టాల్సిందే.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో వరుడు అదిరిపోయే, ఎనర్జిటిక్ డ్యాన్స్ చేశాడు. పాట కూడా మామూలుగా లేదు, సూపర్ హిట్ సినిమా ‘కరణ్ అర్జున్’లోని పవర్ఫుల్ డైలాగ్ ‘ఠాకూర్ తో గయో’ (Thakur toh gayo) రీమిక్స్ వెర్షన్‌కు అతను స్టెప్పులు వేశాడు. వీడియోలో డీజేలో ఆ డైలాగ్ ప్లే అవగానే, వరుడు తన మెడను, భుజాలను ఊపుతూ, తిప్పుతూ కనిపించాడు. అతని డ్యాన్స్‌ను చూసిన వారు ఆశ్చర్యపోయారు.
View this post on Instagram
ఆ తర్వాత నటి రాఖీ ఐకానిక్ డైలాగ్ ‘మేరే కరణ్ అర్జున్ ఆయేంగే’ (Mere Karan Arjun aayenge) ప్లే అవుతుంది. ఈ డైలాగ్‌కు వరుడు చూపించిన స్పెషల్ స్వాగ్, కాన్ఫిడెన్స్ నిజంగా చూడాల్సిందే. మొత్తం మీద, వరుడి డ్యాన్స్‌లో ఉన్న స్టైల్, ఎనర్జీ చూస్తే అతనికి డ్యాన్స్ రాదని ఎవరూ చెప్పలేరు. ఒక రకంగా అతను ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ లాగా స్టెప్పులు వేశాడు.
@aelex_0_007 అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియో రాకెట్ స్పీడులో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీని కామెంట్ సెక్షన్లో సరదా వ్యాఖ్యలతో నిండిపోయింది. ఒక యూజర్, “వరుడు డ్యాన్స్ అదిరిపోయేలా చేశాడు. కానీ తప్పు రోజును ఎంచుకున్నాడు” అంటూ కామెంట్ చేశారు. మరొక యూజర్ సరదాగా.. “జీవితంలో ఎప్పుడూ ఇంత కాన్ఫిడెన్స్ రాకూడదు” అని అన్నారు. ఇంకొక యూజర్, “వరుడిలో మైఖేల్ జాక్సన్ ఆత్మ ప్రవేశించినట్లుంది” అని రాశారు. “ఆపేయ్ సోదరా, షేర్వానీ చిరిగిపోతుంది” అని మరొక యూజర్ కామెంట్ చేశారు.
-
Viral Video: ప్రాణాలకు తెగించి స్టంట్స్.. ఆఫీసు పని కోసం షాకింగ్ సాహసం!
-
Viral Video : రైలులో సీటు కోసం రచ్చ.. ప్రయాణీకుల మధ్య వాగ్వాదం
-
Viral Video : పసికందుతో కింగ్ కోబ్రా ఆట.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Viral Video : నడుస్తున్న రైలుపై పరుగులు పెట్టిన యువతి.. ఈ షాకింగ్ స్టంట్ ఎందుకంటే ?
-
Viral Video : మురికి నీటిలో పడుకొని డ్యాన్స్ చేసిన యువతి.. ఛీ రీల్స్ కోసం ఇంతలా దిగజారాలా ?
-
How Many Times Eat a Day: మూడు సార్లు కాదు.. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యమంటే?