Viral Video: పిల్లలతో ఫుట్‌బాల్ ఆడిన కాకి.. వీడియో చూశారా?

Viral Video: సాధారణంగా చాలా మంది ఇళ్లలో కుక్కలు, పిల్లులు, రామ చిలకలు ఇలా కొన్నింటిని పెంచుకుంటాం. వీటి వల్ల పిల్లలకి సరదాగా ఉంటుందని పెంచుతారు. అయితే పెంపుడు జంతువులు కొన్ని యజమానులతో ఎంతో ఫన్నీగా ప్రవర్తిస్తాయి. కుక్కలు, పిల్లులు యజమానులు చెప్పిన మాట వింటాయి. అందుకే చాలా మంది వాటితో కొన్ని పనులను చేయిస్తుంటారు. న్యూస్ పేపర్ తీసుకొని రావడం, బాల్‌తో ఆడుకోవడం వంటివి చేస్తుంటాయి. అవి తమ ఓనర్‌తో సరదాగా ఆడుకుంటూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తుంటాం. మరోవైపు రామ చిలుకలు మనుషుల లాగే మాట్లాడతాయి. ఇంట్లో వాళ్లు ఎలా మాట్లాడితే అవి అదేవిధంగా రియాక్ట్ అవుతాయి. కొత్తవారు ఇంటికి వస్తే అరచి అందర్నీ అలర్ట్ చేస్తాయి. ఇలాంటి వీడియోలు కూడా గతంలో మనం చూశాం. అయితే ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక కాకి ఇంట్లో పిల్లాడితో కలిసి ఫుట్‌బాల్ ఆడుతోంది.
In a rare video, a crow is seen playing #football with a child somewhere in South Goa pic.twitter.com/jVynpLGC0V
— The Goan 🇮🇳 (@thegoanonline) May 20, 2025
ఈ వీడియో చూసిన వాళ్లందరూ ఆశ్చర్యపోతున్నారు. పిల్లాడు తన కాలితో బాల్‌ను కాకి వైపు తన్నగానే, అది తన ముక్కుతో బాల్‌ను మళ్లీ అతని వైపు నెట్టివేస్తుంది. ఇలా పిల్లాడు తంతూ ఉంటే, కాకి కూడా బంతిని అటూ ఇటూ కదిలిస్తూ బాల్‌తో ఆడుకుంటుంది. “నాకేం నేను ఆడతా” అన్న విధంగా కాకి ఆడుకోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ అద్భుతమైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా, కాకులు తెలివైన పక్షులు అని మనకు తెలుసు. అవి మనుషుల ప్రవర్తనను గమనిస్తాయి. కొన్నిసార్లు వాటిని అనుకరిస్తాయి కూడా. కానీ ఇలా ఫుట్‌బాల్ ఆడటం చాలా అరుదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. “వావ్.. కాకికి భలే ట్రైనింగ్ ఇచ్చారుగా” అని కొందరు, “నిజంగా నమ్మలేకపోతున్నాం!” అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఒక పెంపుడు జంతువులా కాకి ఇలా ప్రవర్తించడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ వీడియో పెంపుడు జంతువుల పట్ల ఉన్న అవగాహనను మరింత పెంచింది. కేవలం కుక్కలు, పిల్లులు మాత్రమే కాకుండా, ఇతర జంతువులు కూడా మనుషులతో స్నేహంగా ఉండగలవని, కొన్ని ఆటలు ఆడగలవని ఈ వీడియో నిరూపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ప్రజలను ఆకట్టుకుంటోంది.
ఇది కూడా చూడండి: Jio Plan : ఒక్క రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రయోజనాలు.. అపరిమిత కాలింగ్, ఓటీటీలు ఉచితం
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు