Viral Video : సూపర్ మార్కెట్లోకి షాపింగ్ కు వెళ్లిన గజరాజు.. పాపం ఆకలేసి ఉంటుంది

Viral Video : ఏనుగులు వాస్తవానికి సాధు జంతువులు. అవి ఊరికే ఎవరి జోలికి పోవు. ఒకవేళ వాటికి కోపం వస్తే లేదా మదమెక్కితే వాటిని కంట్రోల్ చేయడం మాత్రం చాలా కష్టం. మనుషులనే కాదు, దారిలో అడ్డువచ్చిన వస్తువులను కూడా విసిరేసి రచ్చ రచ్చ చేస్తుంటాయి. కానీ, ఇప్పుడు ఒక ఏనుగు ఏకంగా ఒక సూపర్మార్కెట్లోకి దూరి షాపింగ్ చేసింది. అవును, థాయ్‌లాండ్‌లోని (Thailand) ఒక సూపర్మార్కెట్లో ఇలాంటి అరుదైన సంఘటన జరిగింది. దానికి ఏం కావాలో అదంతా తిని అక్కడి నుంచి సైలెంటుగా వెళ్లిపోయింది.
ఇండిపెండెంట్ నివేదికల ప్రకారం.. ఈ ఏనుగు థాయ్‌లాండ్‌లోని కావో యాయ్ నేషనల్ పార్క్ (Khayo Yai National Park) కు చెందినది. దీని పేరు ప్లాయ్ బియాంగ్ లెక్ (Plai Biang Lek) గా గుర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే, ఈ వీడియో విపరీతంగా నెటిజన్ల మనసులను గెలుచుకుంది.
Read Also:Bengaluru Stampede : విరాట్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
Bangkokcommunityhelp అనే అకౌంట్ నుంచి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోతో పాటు క్యాప్షన్‌లో ఇలా రాశారు: “ఒక ఏనుగు అనుకోకుండా ఒక సూపర్ మార్కెట్ సందర్శించింది. థాయ్‌లాండ్‌లో ఇది ఒక కామన్ డే. వెళ్తూ వెళ్తూ, ఆకలితో ఉన్న ఏనుగు దారిలో తినడానికి కొన్ని బిస్కెట్లను కూడా తీసుకుంది.” ఈ వీడియోలో ఆకలితో ఉన్న ఒక ఏనుగు సూపర్ మార్కెట్లోకి చొరబడి, తనకు ఏం కావాలో అదంతా తింటున్నట్లు చూడవచ్చు. సూపర్ మార్కెట్లోకి ప్రవేశించిన ఆ ఏనుగు, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా, షెల్ఫ్‌లలో అమర్చిన తినుబండారాలను తిని, అక్కడి నుండి వెళ్లిపోయినట్లు వీడియోలో చూడవచ్చు.
View this post on Instagram
జూన్ 2న షేర్ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటికే 2.7 మిలియన్ల (27 లక్షలు) కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఒక యూజర్, “ఏనుగులు కూడా స్నాక్స్ తినడానికి ఇలా చేస్తాయి” అని కామెంట్ చేయగా. మరొకరు, “ఏనుగులు ప్రశాంతంగా ప్రవర్తించడం చాలా అరుదు, కానీ ఈ ఏనుగు తనకు ఏం కావాలో అది మాత్రమే తీసుకువెళ్లడం ఆశ్చర్యంగా ఉంది” అని కామెంట్ చేశారు. ఇంకొక యూజర్, “పాపం, ఆకలేసి ఉంటుంది, తిననివ్వండి” అని కామెంట్ చేశారు.
Read Also:Viral Video : సినిమా సీన్ తలపించిన ఘటన.. పెళ్లి మండపం నుంచి వధువు సోదరిని తీసుకెళ్లిన ప్రియుడు
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు