Bank Deposit : బ్యాంకు మూతపడితే డిపాజిట్ చేసిన డబ్బు ఏం అవుతుంది? మీకు ఎంత వస్తుంది?

Bank Deposit : బ్యాంకులను నమ్మి ఎంతో మంది డబ్బులు డిపాజిట్ చేస్తారు. ఎక్కడ లేని సెక్యూరిటీ కేవలం బ్యాంకులో మాత్రమే ఉంటుందని నమ్మేవారు చాలా ఎక్కువ. బ్యాంకులు కూడా అదే తరహా భద్రతను కలిపిస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు మధ్య మధ్యలో మూత పడుతుంటాయి. చాలా చిన్న బ్యాంకులు, ఎవరికీ తెలియని బ్యాంకుల విషయంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. లేదంటే ఇతర బ్యాంకులతో మెర్జ్ అవుతాయి. మెర్జ్ అయితే పెద్ద సమస్య లేదు. కానీ ఆ బ్యాంకు మూత పడితే పరిస్థి ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివేసేయండి.
రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకు మీద ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ బ్యాంకు గురించి పరిశీలిస్తే మనకు కావాల్సిన ఆన్సర్ దొరుకుతుంది. అయితే ఈ బ్యాంకు విషయంలో ఏం జరిగిందంటే? బ్యాంకు ఖాతాదారులు బ్యాంకుల ముందు క్యూ కట్టారు. కొన్ని రోజుల నుంచి లావాదేవీలు నిలిచిపోయాయి. లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరగడం లేదు. కొందరు సంవత్సరాల తరబడి పెన్షన్ ను కూడా తీసుకోవడం లేదు. మరి ఇలాంటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆర్బీఐ కూడా ఆరు నెలల పాటు ఎలాంటి లావాదేవీలు ఉండవని చెబితే ఇక పరస్థితిని అంచనా కూడా వేయలేం కదా.
ఈ బ్యాంకు బ్రాంచ్ ల వద్ద రద్దీ పెరుగుతున్న కొద్ది బ్యాంకు 9769008501 ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా కస్టమర్లకు పూర్తి సమాచారం ఇచ్చే అవకాశం కల్పించింది. అంతేకాదు బ్యాంక్ లాకర్ వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచింది. దీని ద్వారా ఖాతాదారుడు తమ లాకర్ లో ఉన్న డబ్బును తీసుకోవచ్చన్నమాట. కానీ ఆర్బీఐ కొన్ని నిబంధనలను కూడా పెట్టింది. బ్యాంకు, కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తుంది ఆర్బీఐ. ఇక బ్యాంకులు మూతపడితే ఎంత డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చో DICGC నిర్ణయిస్తుంది.
ఇంతకీ ఈ DICGC అంటే ఏమిటి?
DICGC అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ అని అర్థం. 1978లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని స్థాపించింది. బ్యాంకులో డబ్బు జమ చేసిన వారికి బీమా కవరేజీని అందిస్తుంది ఈ కార్పొరేషన్. అయితే ఓ బ్యాంకు దివాలా తీసినా లేదా మూత పడినా సరే దీని ద్వారా ప్రజలు డబ్బులకు డబ్బు లభిస్తుంది. అయితే ఇది కూడా బీమా కోసం మాత్రమేనట. దాన్ని కస్టమర్లకు నేరుగా అందివ్వకుండా బీమా కవర్ ప్రతి డిపాజిటర్ కు రూ. 5 లక్షల వరకు ఇస్తుంటారు. డిపాజిట్ రకంతో సంబంధం లేకుండా దీన్ని ఇస్తుంటారు.
ఎంత డబ్బు వస్తుందంటే?
బ్యాంకు కస్టమర్లకు DICGC కింద డబ్బులు వస్తాయి. దీని ప్రకారం బ్యాంకు మూత పడితే గరిష్టంగా రూ. 5 లక్షలు వస్తాయి. బ్యాంకులో ఎంత డిపాజిట్ చేసినా సరే కేవలం రూ. 5 లక్షలు మాత్రమే డబ్బులు వస్తాయి. ఎవరైనా తక్కువ డబ్బులు డిపాజిట్ చేస్తే అంత మాత్రమే వారికి డబ్బు వస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
-
RBI : RBI గుడ్ న్యూస్.. లోన్ EMI చెల్లించే వారికి ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లు తగ్గింపు..
-
Airtel : ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకే ప్లాన్లో అన్నీ
-
UPI Payments : UPI ల ద్వారా దుబారా ఖర్చు ఎక్కువ అవుతుందా?
-
Punjab National Bank: ఇల్లు, కారు కొనాలని చూస్తున్నారా? వెంటనే ప్లాన్ చేసుకొండి ఈ బ్యాంకులో అదిరిపోయే ఆఫర్.
-
Bank Deposit: బ్యాంకు అకౌంట్ ఉందా.. ఈ శుభవార్త మీ కోసమే.. రూ.12 లక్షల క్రెడిట్ గ్యారెంటీ
-
Hermes Company: ఉద్యోగాలు పోతున్న వేళ.. పింక్ స్లిప్ లు జారీ చేస్తున్న వేళ.. ఈ కంపెనీ చేసిన పనికి ఉద్యోగులు షాక్!