Bank Deposit: బ్యాంకులో ఎక్కువగా డిపాజిట్ చేశారో.. మీకు నోటీసులు తప్పవు

Bank Deposit: సాధారణంగా అందరికీ కూడా సేవింగ్స్ ఉంటాయి. ఇప్పుడుంటే అందరూ ఫోన్‌పేలు, గూగుల్ పేలు వాడుతున్నారు. కానీ అప్పట్లో ఎక్కువగా సేవింగ్ అకౌంట్స్ వాడేవారు. దీంతో డబ్బులు దాచిపెట్టడానికి డబ్బులు వేయడానికి బ్యాంక్‌కు వెళ్లేవారు. ఇప్పుడంటే అంతా మారిపోయింది. చాలా మంది లావాదేవీలు అన్ని కూడా ఈ సేవింగ్స్ అకౌంట్ నుంచే చేస్తారు. అప్పుడు బ్యాంకుకు వెళ్లి నగదు జమ చేస్తే.. ఇప్పుడు డిపాజిట్ మిషన్‌లో వేస్తు్న్నారు. సాధారణంగా తక్కువ డబ్బు బ్యాంకులో వేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కువ డబ్బులు బ్యాంకులో వేస్తే కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇంతకు ముందు పాన్ కార్డు ఉంటేనే డబ్బులు కూడా డిపాజిట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అన్ని రూల్స్ కూడా బ్యాంకులు మారనున్నాయి. పరిమితికి మించి బ్యాంకులో డబ్బులు వేస్తే మాత్రం నోటీసులు వస్తాయని తెలుస్తోంది. అయితే నగదు డిపాజిట్ చేసే విషయంలో పాటించాల్సిన రూల్స్ ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మనందరికీ సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి. ఎక్కువ మంది డబ్బు లావాదేవీలు ఈ అకౌంట్స్ నుంచి చేస్తారు. అయితే ఎప్పటికప్పుడు వీటిలో రూల్స్ మారిపోతుంటాయి. అయితే గతంలో ఎంత డిపాజిట్ చేసినా పర్లేదు. ఎక్కువగా డిపాజిట్ చేస్తే మాత్రం పాన్ కార్డు తీసుకునేవారు. అయితే రోజుకి డిపాజిట్ కూడా రూ.లక్ష కంటే ఎక్కువగా ఉండకూడదు. అయితే ఒక ఫైనాన్షియల్ ఇయలో మొత్తం రూ.10 లక్షల వరకు డబ్బులను డిపాజిట్ చేయవచ్చు. అయితే మీ దగ్గర ఉన్న అన్ని అకౌంట్లలో కూడా రూ.10 లక్షల లిమిట్ దాటితే మాత్రం తప్పకుండా ఆ లావాదేవీలను వెంటనే ఆదాయపు పన్ను శాఖకు చెప్పాలి. అలాగే మీ డిపాజిట్ వివరాలను కూడా తెలియజేయాలి.
మీరు ఆ వివరాలను ఇవ్వకపోతే మాత్రం ఆదాయపు పన్ను శాఖ మీ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా ట్రాక్ చేస్తుంది. ఎక్కువగా డబ్బు ఉండి, మీరు ఎలాంటి వివరాలు తెలియజేయకపోతే మాత్రం మీకు నోటీసులు వస్తాయి. కాబట్టి ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ అయితే మాత్రం వెంటనే మీరు వివరాలను తెలియజేయండి. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది అధిక మొత్తంలో డబ్బు లావాదేవీలు చేస్తున్నారు. కానీ వాటి రూల్స్ పాటించడం లేదు. ఎక్కువ మొత్తంలో సంపాదించినా కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టడం లేదు. దీనివల్ల కూడా ఐటీఆర్ ఫైల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డబ్బుల లావాదేవీల విషయంలో తప్పకుండా అన్ని రూల్స్ పాటించండి. దీనివల్ల మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు.
-
Money: ఈ చెట్టు ఆకుతో మీరు ఇలా చేస్తే.. డబ్బే డబ్బు
-
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు ఈ చిన్న పని చేస్తే.. డబ్బే డబ్బు
-
Late Marriage: ఆలస్యంగా పెళ్లి అవుతుందని చింతించకు బ్రో.. ఈ మ్యారేజ్ కూడా ఆరోగ్యానికి మంచిదేనట!
-
IPL: ఐపీఎల్లో చీర్లీడర్లు ఒక్కో మ్యాచ్‌కు ఎంత సంపాదిస్తారంటే?
-
BCCI: ఆ రూల్ మార్చం.. తగ్గేదేలే అంటున్న బీసీసీఐ
-
Gold loan: ఆర్బీఐ కీలక నిర్ణయం.. గోల్డ్ లోన్ ఇకపై రావడం డౌటే