Top up loan: టాప్ అప్ లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తప్పనిసరి
డబ్బు అవసరం అనేది ప్రతీ ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో వస్తుంటుంది. ఎంత డబ్బు ఉన్నా కూడా కొన్నిసార్లు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇళ్లు, ఇతర అవసరాలకు అప్పు కావాలంటే చాలా మంది పర్సనల్ లోన్ పెట్టుకుంటారు.

Top up loan: డబ్బు అవసరం అనేది ప్రతీ ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో వస్తుంటుంది. ఎంత డబ్బు ఉన్నా కూడా కొన్నిసార్లు అప్పు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇళ్లు, ఇతర అవసరాలకు అప్పు కావాలంటే చాలా మంది పర్సనల్ లోన్ పెట్టుకుంటారు. అయితే డబ్బుల కోసం బ్యాంకులు ఇదే లోన్ కాకుండా ఇంకోక లోన్ కూడా ఇస్తుంది. అదే టాప్ అప్ లోన్. దీన్ని చాలా మంది డబ్బు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు. అయితే ఎప్పుడో అవసరానికి లోన్ తీసుకుంటే పర్లేదు. బ్యాంకు వాళ్లు లోన్ ఇస్తున్నారని మీరు అధికంగా లోన్ తీసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. ఎందుకంటే టాప్ అప్ లోన్ ఇస్తున్నాడని ఎక్కువగా తీసుకుంటే తర్వాత సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని నిపుణులు అంటున్నారు. తెలుసో తెలియక ఎక్కువగా టాప్ అప్ లోన్ తీసుకుంటే ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. అప్పుల భారం పెరిగితే అసలు మానసిక సంతోషం ఉండదు. అయితే టాప్ అప్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
Read also: ఆలస్యంగా పెళ్లి అవుతుందని చింతించకు బ్రో.. ఈ మ్యారేజ్ కూడా ఆరోగ్యానికి మంచిదేనట!
రుణ భారం
టాప్-అప్ లోన్ తీసుకునే ముందు రుణం తిరిగి చెల్లించే స్తోమత ఉందా? లేదా? అనే విషయం తెలుసుకోండి. ముఖ్యంగా ప్రతీ నెలా కట్టగలరా? లేదా? అని చూడండి. మీరు రుణం అంతా కూడా క్లియర్‌గా తెలుసుకున్న తర్వాతే తీసుకోవడం ఉత్తమం.
ఫ్లెక్సిబుల్ ఫండ్ యుటిలైజేషన్
డబ్బును దేనికోసమైనా కూడా వాడవచ్చు. అయితే ఈ టాప్ అప్ లోన్‌ను ఖర్చు పెట్టడానికి కాస్త పరిమితులు ఉంటాయి. డబ్బును ఎలా ఖర్చు చేయాలని ఉంటుంది. అయితే మీరు దేని కోసం వాటిని ఖర్చు చేయాలని అనుకుంటున్నారో క్లారిటీ తెచ్చుకోండి. దీనివల్ల మీ డబ్బు వృథా కాదు.
Read also: ధరించే దుస్తుల్లోనే రిచ్‌గా కనిపించాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే
వడ్డీ రేట్లు
టాప్ అప్ లోన్ తీసుకునే వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది.. వడ్డీ రేట్లు. పర్సనల్ లోన్‌తో పోలిస్తే.. టాప్ అప్ లోన్ వడ్డీ రేట్లు కాస్త ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ లోన్ తీసుకునేటప్పుడు తప్పకుండా వడ్డీ రేట్లు తెలుసుకుని తీసుకోండి.
సమయం
మీరు లోన్ తీసుకున్న తర్వాత ఎప్పటిలోగా తిరిగి చెల్లించాలనే సమయం కూడా ముందే తెలుసుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు.
క్రెడిట్ కార్డును ప్రభావితం చేయకుండా..
టాప్ అప్ లోన్ ఎక్కువగా క్రెడిట్ కార్డును ప్రభావితం చేస్తుంది. ఇది క్రెడిట్ కార్డును ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మీరు ముందుగానే ఈ విషయాలు తెలుసుకోవాలి. అలాగే హిస్టరీని కూడా తెలుసుకోవాలి. మీ క్రెడిట్ కార్డు స్కోర్ ఎలా ఉందనే వివరాలు తెలుసుకుని తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
ముందే తెలుసుకోవాలి
టాప్ అప్ లోన్ తీసుకునే ముందు అన్ని ఆలోచించాలి. వడ్డీ రేట్లు, ఎన్ని రోజులు, ఎలా ఉంటుందనే విషయాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ టాప్ అప్ లోన్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.