Hermes Company: ఉద్యోగాలు పోతున్న వేళ.. పింక్ స్లిప్ లు జారీ చేస్తున్న వేళ.. ఈ కంపెనీ చేసిన పనికి ఉద్యోగులు షాక్!
Hermes Company: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత లక్షలాదిమంది కొలువులు కోల్పోయారు. అమెరికా నుంచి మొదలు పెడితే ఆసియా వరకు ఇదే పరిస్థితి. ఆటోమేషన్ తెరపైకి వచ్చిన తర్వాత వేలాదిమందికి ఉపాధి లేకుండా పోయింది. ప్రతిష్టాత్మకమైన కంపెనీలకు ఉద్యోగులను

Hermes Company: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత లక్షలాదిమంది కొలువులు కోల్పోయారు. అమెరికా నుంచి మొదలు పెడితే ఆసియా వరకు ఇదే పరిస్థితి. ఆటోమేషన్ తెరపైకి వచ్చిన తర్వాత వేలాదిమందికి ఉపాధి లేకుండా పోయింది. ప్రతిష్టాత్మకమైన కంపెనీలకు ఉద్యోగులను తొలగించడమే పని అయిపోయింది.
పింక్ స్లిప్పులు జారీ చేయడం.. మొహమాటం లేకుండా తొలగించడం.. రకరకాల ప్రక్రియలతో అన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఐటీ నుంచి ఫార్మా వరకు ఇదే పరిస్థితి ఉంది. కొనుగోళ్లు లేకపోవడం.. అమ్మకాలు పడిపోవడం.. ధరల్లో స్థిరత్వం లేకపోవడం వంటి కారణాలతో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో నిరుద్యోగ రేటు దారుణంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాలు కల్పించడం కంపెనీలకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వాలు కూడా నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మల్టీ నేషనల్ కంపెనీల నిర్వాకం వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడుతున్నారు.. ఈ క్రమంలో ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కనివిని ఎరుగని స్థాయిలో బోనస్ ప్రకటించింది.
నాలుగు లక్షలు ఇచ్చేసింది
ఆ మధ్య దీపావళి పండుగ సందర్భంగా చెన్నైకి చెందిన ఒక కంపెనీ తన ఉద్యోగులకు బీఎండబ్ల్యూ కార్లు, ద్విచక్ర వాహనాలను కానుకలు అందించింది. సూరత్ కు చెందిన ఓ వజ్రాల కంపెనీ ఉద్యోగులకు ఫ్లాట్లను బహుకరించింది. పూణే ప్రాంతానికి చెందిన ఓ ఫార్మా కంపెనీ తన ఉద్యోగులకు అపార్ట్మెంట్లలను కానుకలుగా ఇచ్చింది. అయితే ఇప్పుడు పారిస్ ప్రాంతానికి చెందిన ఓ కంపెనీ ఓ కంపెనీ ఉద్యోగులకు 4 లక్షలను బోనస్ గా అందించింది. వాస్తవానికి లాభాలను ఉద్యోగులకు పంచే కంపెనీలు కొన్ని మాత్రమే ఉంటాయి. పారిస్లోని ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ హేర్మస్ కంపెనీ గత ఏడాది అసాధారణ లాభాలు రావడంతో ఉద్యోగులకు 4 లక్షల రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ దేశాలలో హెర్మేస్ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. 25వేల మంది ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ కంపెనీ నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయడం.. అంతర్జాతీయంగా తన మార్కెట్ పెంచుకోవడంతో.. భారీగా లాభాలు సాధించింది. దీంతో ఆ కంపెనీ సాధించిన లాభాలలో ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది. సాధించిన లాభాల ప్రకారం ఒక్కో ఉద్యోగికి నాలుగు లక్షలు అందించింది.. కంపెనీ నాలుగు లక్షలు బోనస్ ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ 10 కాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. “కంపెనీ నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తోంది.. ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలు కూడా పెరగడంతో లాభాలు నమోదు చేసింది. ఇందులో మా పాత్రను కూడా కంపెనీ యాజమాన్యం గుర్తించింది. అందువల్లే మా జీతాలను పెంచింది. బోనస్ కూడా ఇస్తామని ప్రకటించింది. ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పింది. ఇంతకంటే ఇంకొక విషయం ఏముంటుంది. ఇది మా శ్రమకు తగ్గిన ఫలితం అని మేము భావిస్తున్నామని” ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు
-
RBI : RBI గుడ్ న్యూస్.. లోన్ EMI చెల్లించే వారికి ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లు తగ్గింపు..
-
Airtel : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకే ప్లాన్‌లో అన్నీ
-
UPI Payments : UPI ల ద్వారా దుబారా ఖర్చు ఎక్కువ అవుతుందా?
-
Punjab National Bank: ఇల్లు, కారు కొనాలని చూస్తున్నారా? వెంటనే ప్లాన్ చేసుకొండి ఈ బ్యాంకులో అదిరిపోయే ఆఫర్.
-
Credit Card: క్రెడిట్ కార్డు ఇన్‌యాక్టివ్‌లో ఉందా? యాక్టివేట్ చేయడం ఎలా?
-
Gold Loan: గోల్డ్ లోన్‌పై న్యూ రూల్స్.. నోటీస్ లేకుండా బంగారం వేలం వేస్తే ఏమవుతుందో మీకు తెలుసా?