TVS Jupiter: చీపెస్ట్ స్కూటీ.. ప్రారంభ ధర రూ.53వేలు.. 226కి.మీ గరిష్ట మైలేజ్.. !

TVS Jupiter: ప్రముఖ వాహన తయారీదారు టీవీఎస్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కూటర్లను లాంచ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ కంపెనీలో జుపిటర్ స్కూటర్ కు విశేష ఆదరణ ఉంది. భారత మార్కెట్లో టీవీఎస్ జూపిటర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. 2013లో విడుదలైన ఈ స్కూటర్.. అప్పటినుంచి ఇప్పటివరకు తనదైన శైలిలో ఆకట్టుకుంటూ వస్తోంది. 2022 నాటికి 5 మిలియన్ యూనిట్లు సేల్ అయ్యాయి. అది 2025 జనవరి నాటికి ఈ సంఖ్య మరింత పెరిగింది. దాదాపు 7 మిలియన్ యూనిట్ల మైలురాయి దాటింది. ఈ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది.. ఈ స్కూటర్ పై ఎలాంటి ఆసక్తి చూపిస్తున్నారు అనేది.
ఇదిలా ఉంటే టీవీఎస్ ఇటీవలే కొత్త జుపిటర్ ను రిలీజ్ చేసింది. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో జూపిటర్ 110 విషయానికి వస్తే.. ఈ స్కూటర్ 113 సీసీ పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులోకి వచ్చింది. ఇది లీటర్ పెట్రోల్ కు ఏకంగా 53.84 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. ఇక దీని ధర విషయానికొస్తే.. ఇది రూ. 78,391 నుంచి రూ. 92,366 ఎక్స్ షోరూమ్ ధర మధ్య ఉంటుంది. వీటితోపాటు ఈ స్కూటర్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ తో వస్తుంది.
దీంతోపాటు జుపిటర్ 125 విషయానికి వస్తే.. ఈ స్కూటర్ 124.8 సీసీ పెట్రోల్ ఇంజన్ తో పరుగులు పెడుతుంది. ఇది లీటర్ పెట్రోల్ కు దాదాపు 55 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. పెద్దపెద్ద సిటీలోనే కాకుండా గ్రామీణ రోడ్లపై కూడా రై రై మంటూ పరుగులు పెడుతుంది. ఇది రూ. 88,174 ధర నుంచి ప్రారంభమై రూ. 99,015 ఎక్స్ షోరూం వరకు ఉంటుంది. ఈ వేరియంట్ కూడా ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఫీచర్ ను కలిగి ఉంది. దీంతోపాటు యుఎస్బి చార్జింగ్ సాకెట్ అందించారు.
చివరగా టీవీఎస్ జూపిటర్ సిఎన్జి స్కూటర్ ఉంది. ఇది 124.8 సిసి పెట్రోల్/సిఎన్జి ఇంజన్ ను కలిగి ఉంది. ఇది రెండు ఆప్షన్లతో కలిపి దాదాపు 226 కిలోమీటర్ మైలేజీ అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 80.5 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో రన్ అవుతుంది. ఈ స్కూటర్ ధర ను రూ.1 లక్ష ఎక్స్ షోరూం గా నిర్ణయించారు.
-
Exams complete: విద్యార్థులకు పరీక్షలు ముగిశాయా.. ఓ కన్నేసి ఉంచండి
-
Rashmika Mandanna: రష్మిక ఆస్తులు తెలిస్తే.. షాక్ కావాల్సిందే
-
Concentration: ఏకాగ్రత ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే
-
Motorola: రూ.6999 కే 50MP కెమెరా ప్రీమియం లుక్ ఫోన్..!
-
Indian Post: GDS రిజల్ట్స్ వచ్చేసాయ్.. ఇలా చెక్ చేసుకోండి!
-
Motorola: 8జీబీ ర్యామ్ ఫోన్ వెరీ చీప్.. రూ.10వేల లోపే!