Gold Loan: గోల్డ్ లోన్‌పై న్యూ రూల్స్.. నోటీస్ లేకుండా బంగారం వేలం వేస్తే ఏమవుతుందో మీకు తెలుసా?
Gold Loan: చాలా మంది బంగారం లోన్ పెడుతుంటారు. ఇలా లోన్ పెట్టిన తర్వాత డబ్బులు కట్టలేక కొందరు ఆ బంగారాన్ని బ్యాంకులోనే వదిలేస్తారు. ఇలా గోల్డ్ లోన్ చెల్లించలేని వారి బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటాయి. అయితే ఇలా గోల్డ్ లోన్ చెల్లించలేని ప్రజల సొమ్మును బ్యాంకులు,

Gold Loan: చాలా మంది బంగారం లోన్ పెడుతుంటారు. ఇలా లోన్ పెట్టిన తర్వాత డబ్బులు కట్టలేక కొందరు ఆ బంగారాన్ని బ్యాంకులోనే వదిలేస్తారు. ఇలా గోల్డ్ లోన్ చెల్లించలేని వారి బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటాయి. అయితే ఇలా గోల్డ్ లోన్ చెల్లించలేని ప్రజల సొమ్మును బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు వేలం వేయకూడదని కేంద్రం తెలిపింది. బంగారం తాకట్టు పెట్టే విషయంలో అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తప్పకుండా అన్ని నిబంధనలను పాటించాలని వెల్లడించింది. అందరూ కూడా ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి. దీని వల్ల సామాన్యుల విలువైన వస్తువులు, ఆభరణాలు అన్యాయంగా వేలంలో పోవు. ఈ కొత్త రూల్ వల్ల సామాన్యులకు అన్యాయం జరగదు. అయితే కేంద్రం ప్రకటించిన కొత్త రూల్ ప్రకారం కమర్షియల్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు గోల్డ్ లోన్ ఔట్‌స్టాండింగ్ పేమెంట్లను కోల్పోతే.. బంగారం వేలం వేసే ముందు కస్టమర్లకు నోటీసులు పంపించాలి. అయితే గడువు ముగియక ముందు నుంచే అందించాలి. చాలామంది బంగారం తాకట్టు పెట్టినప్పుడు.. వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వేలం వేస్తుంటారు. ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని కేంద్రం తెలిపింది. ఈ కొత్త రూల్‌ను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు తప్పకుండా పాటించాలి. కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిని తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
డబ్బులు సమస్య కారణంతో చాలా మంది గోల్డ్ లోన్ తీసుకుంటారు. ఇంట్లో ఉన్న బంగారం తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. ఆ తర్వాత వాటికి వడ్డీ కట్టలేక కొందరు బంగారం మధ్యలోనే వదిలేస్తారు. తక్కువ సమయం అయితే వడ్డీ తక్కువగానే ఉంటుంది. అదే ఎక్కువ రోజులు వడ్డీ కట్టకుండా ఉంటే.. పెరిగిపోతుంది. దీంతో వారు ఆ డబ్బులు కట్టడం కంటే మళ్లీ బంగారం కొనుక్కోవడం బెటర్ అని ఆలోచిస్తారు. దీంతో ఈ బంగారం అక్కడే వదిలేస్తారు. ఇలా ఉండిపోయిన బంగారాన్ని బ్యాంకు వాళ్లు వేలం వేస్తుంటారు. దీంతో సామాన్యులు విలువైన వస్తువులను కోల్పోతారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై తప్పకుండా ఈ రూల్స్ పాటించాలి. లేకపోతే కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటారు.
-
Gold Loan: బంగారం లోన్ తీసుకునే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవడం మరిచిపోవద్దు
-
RBI : RBI గుడ్ న్యూస్.. లోన్ EMI చెల్లించే వారికి ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్లు తగ్గింపు..
-
Airtel : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఒకే ప్లాన్‌లో అన్నీ
-
UPI Payments : UPI ల ద్వారా దుబారా ఖర్చు ఎక్కువ అవుతుందా?
-
Gold loan: ఆర్బీఐ కీలక నిర్ణయం.. గోల్డ్ లోన్ ఇకపై రావడం డౌటే
-
Business Loans : ఆ విషయంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువట.. అప్పులు చేసి మరీ..